NTV Telugu Site icon

Google Fine: గూగుల్‎కు ఎదురుదెబ్బ.. వారంలో రెండోసారి భారీ ఫైన్

Google

Google

Google Fine: ప్రముఖ సెర్చింజిన్, టెక్ దిగ్గజం గూగుల్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గూగుల్ తన ప్లే స్టోర్ ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులను అవలంబిస్తోందంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) భారీ జరిమానా విధించింది. గూగుల్ మార్కెట్ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ మంగళవారంనాడు రూ. 936.44 కోట్ల భారీ జరిమానాను వేసింది. తన పద్ధతి మార్చుకోవాలని తేల్చి చెప్పింది. గూగుల్‌కు జరిమానా విధించడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం.

Read Also: RGV Tweet On Rishi Sunak : రిషి సునాక్‎పై ఆర్టీవీ సంచలన ట్వీట్.. అవకాశం దొరికిందంటూ

గూగుల్ ప్లేస్టోర్‌లో తమ యాప్ లిస్ట్ కావాలంటే గూగుల్ నియమాలను పాటించాలి. అంతేగాక, గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్ ను అనుసరించాల్సి ఉంటుంది. దీంతో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని సీసీఐ గమనించింది. ఈ క్రమంలోనే గూగుల్ కు భారీ జరిమానా విధించింది. యాప్ డెవలపర్లు తమ యాప్.. యూజర్లకు చేరాలంటే యాప్ స్టోర్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే, మనదేశంలో వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్లలో చాలా వరకు ఆండ్రాయిడ్‌వే ఉన్నాయి. దీంతో యాప్ డెవలపర్లకు ప్లేస్టోర్ ఒక్కటే ఆధారంగా మారింది.

Read Also: Kantara Record: కేజీఫ్ రికార్డులను బ్రేక్ చేసిన కాంతార

దీంతో వారం రోజులు కూడా తిరగక ముందే గూగుల్‌పై సీసీఐ రెండోసారి జరిమానా విధించినట్లయింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్ తో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందంటూ రూ. 1337.76 కోట్లు జరిమానా విధించాలని ఆదేశించింది. దీంతో మొత్తం జరిమానా 2274 కోట్లకు చేరింది. కాగా, తాజా జరిమానాపై గూగుల్ ఇంకా వ్యాఖ్యానించలేదు.