Site icon NTV Telugu

Heroine Rambha: వెండితెరకి గ్రాండ్ రీ-ఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరోయిన్

Heroine Rambha

Heroine Rambha

Heroine Rambha: 90వ దశకంలో అందం, అభినయం, తన గ్లామర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటి రంభ. ఇప్పడు మరోమారు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. నటనకు విరామం ఇచ్చిన తర్వాత, ఇప్పుడు మరింత కీలక పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ వంటి పలు భాషల్లో రంభ నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె తన ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్, ఆకట్టుకునే అభినయం, హాస్యానికి పెట్టింది పేరుగా నిలిచారు. ఈ రోజుల్లోనూ ఆమె పాత సినిమాలు టీవీల్లో ప్రసారమైనా అభిమానులు ఇప్పటికీ ఆసక్తిగా చూస్తుంటారు.

Read Also: Movies In March 2025: మార్చి నెలలో థియేటర్స్‌లో సందడి చేయనున్న సినిమాల లిస్ట్ ఇదిగో!

ఇక తాజాగా తన రీఎంట్రీ గురించి రంభ మాట్లాడుతూ.. “సినిమా అంటే నాకు ఎప్పటినుంచో అమితమైన ప్రేమ. ఇప్పుడు మళ్లీ వెండితెరకు రావడానికి సరైన సమయం అని భావించాను. నటిగా నాకు కొత్త తరహా పాత్రలు చేయాలని ఉంది. ప్రేక్షకులకు మరింత కొత్త అనుభూతిని అందించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని తెలిపారు. రంభ రీఎంట్రీ వార్త వినగానే అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆమె మళ్లీ ప్రేక్షకులను తనదైన స్టైల్‌తో మంత్రముగ్ధులను చేయడం ఖాయం. ఇండస్ట్రీలో కూడా ఆమె రీఎంట్రీపై మంచి ఆసక్తి నెలకొంది. ఈ రీఎంట్రీతో రంభ కెరీర్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది. మరి ఆమెను ఏ విధమైన పాత్రల్లో చూడబోతామో చుడాలిమరి.

Exit mobile version