NTV Telugu Site icon

Lemons: దేవుడా.. 9 నిమ్మకాయలు కేవలం రెండున్నర లక్షలే.. అసలు అంతలా ఏముంది వాటిలో..?!

22

22

మామూలుగా మార్కెట్లో నిమ్మకాయ ధర ఏమాత్రం ఉంటుంది. సీజన్ టైంలో అయితే ఒక్క రూపాయి ఉన్న నిమ్మకాయ అదే అన్ సీజన్ లో 5 లేదా 10 రూపాయల వరకు చేరుతుంది. మామూలు సమయంలో ఒక్క నిమ్మకాయ రెండు లేదా మూడు రూపాయలకు దొరుకుతుంది. అలాంటి నిమ్మకాయకు ఇప్పుడు ఏకంగా లక్షల రూపాయలను పెట్టి కొనుగోలు చేస్తున్నారంటే నమ్ముతారా. అవునండి కేవలం 9 నిమ్మకాయలు అక్షరాల రెండున్నర లక్ష రూపాయలు పెట్టి కొన్నారు భక్తులు. దీన్నిబట్టి చూస్తే ఒక్కో నిమ్మకాయ అక్షరాల 25 వేల రూపాయలు పలికిందన్నమాట. అయితే ఇంత ధర పలికిన నిమ్మకాయలు కథేంటి.. అసలు వాటి ప్రత్యేకత అని అనుకుంటున్నారా..? అయితే ఈ నిమ్మకాయలకు సంబంధించి విషయం చూస్తే..

Also read: Om Bheem Bush: వసూళ్ల సునామీ సృష్టిస్తున్న శ్రీవిష్ణు మూవీ.. ఎన్ని కోట్లంటే?

తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురంలోని సుబ్రమణ్య స్వామి ఆలయానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఆ సమయంలో సుబ్రహ్మణ్యస్వామి సూలానికి గుచ్చిన నిమ్మకాయల వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని అక్కడ ప్రజల నమ్మకం. ఇకపోతే ప్రతి సంవత్సరం స్వామివారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగానే తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు సుబ్రహ్మణ్యస్వామి శూలానికి ఒక్క నిమ్మకాయను గుచ్చుతారు. అలా తొమ్మిది రోజులు తొమ్మిది నిమ్మకాయలను గుచ్చి పూజలు చేస్తారు. ఇలా తొమ్మిది రోజులు గడిచిన తర్వాత రోజు ఆలయ కమిటీ వారు ఆ తొమ్మిది నిమ్మకాయలను వేలం పాట నిర్వహిస్తారు.

Also read: CJI Lawyers: ఒత్తిళ్ల వల్ల న్యాయవ్యవస్థకు ముప్పు అంటున్న లాయర్లు..!

దాంతో ఈ ఏడాది జరిగిన వేలంలో భాగంగా 9 నిమ్మకాయలు రెండున్నర లక్షల రూపాయలకు పైగా అమ్ముడుపోయాయి. ఇక ఉత్సవాల భాగంగా మొదటి రోజు పూజ అందుకున్న నిమ్మకాయకు ప్రత్యేక శక్తి ఉంటుందని అక్కడి భక్తులకు నమ్మకం. ఇక ఈ నిమ్మకాయకు సంబంధించి వేలం వేయగా కులతూరు గ్రామానికి చెందిన దంపతులు ఏకంగా 50,500 పెట్టి నిమ్మకాయను సొంతం చేసుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.

Show comments