NTV Telugu Site icon

China Corona : పాలకుల పాపం.. ప్రజలకు శాపం.. చైనాలోని ప్రావిన్స్‎లో 90శాతం మందికి కరోనా

China Covid 19

China Covid 19

China Corona : చైనా చేసిన పాపం ప్రపంచాన్ని నేడు పెను ప్రమాదంలోకి నెట్టింది. కరోనా మహమ్మారి దాటికి దేశాలన్నీ ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ప్రజల జీవనశైలిలో తీవ్ర మార్పును తీసుకొచ్చింది కరోనా. నాలుగు దశల్లో విరుచుకుపడిన మహమ్మారి కోట్లాది మంది ప్రాణాలను బలితీసుకుంది. శాంతించింది అన్న ప్రతీసారి తన ఉనికి చాటుకుంటూ విజృంభిస్తున్నది.

Read Also: Shocking Accident : ప్రయాణికుల పాలిట ఉరి తాళ్లుగా మారుతున్న కేబుల్స్

కరోనా పుట్టినిళ్లు చైనాలో ప్రతిరోజూ లక్షలాది పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనాలో మూడో అతిపెద్ద ప్రావిన్స్‌ అయిన హెనాన్‌లో దాదాపు 90 శాతం మంది ప్రజలు కరోన మహమ్మారి భారిన పడ్డారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రావిన్స్‌లోని మొత్తం జనాభాలో 89 శాతం మందికి వైరస్‌ సోకిందని సెంట్రల్‌ హెనాన్‌ ప్రావిన్స్‌ హెల్త్‌ కమిషన్‌ డైరెక్టర్‌ కాన్‌ క్వాన్‌చెంగ్‌ అన్నారు. జనవరి 6 నాటికి ప్రావిన్స్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్‌ రేటు 89.0 శాతానికి చేరిందన్నారు.

Read Also: Indigo Flight : రోడ్లపై అయిపోయాయి.. ఇక విమానాల్లో మొదలయ్యాయి

ప్రావిన్స్‌లో మొత్తం 9 కోట్ల 94 లక్షల మంది జనాభాలో సుమారు 8 కోట్ల 85 లక్షల మంది మహమ్మారి బారినపడ్డారని వెల్లడించారు. జ్వరం లక్షణాలతో క్లినిక్‌లకు వచ్చేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నదని చెప్పారు. కాగా, చైనాలో గత రెండేండ్లుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ఆంక్షలను గత నెలలో ప్రభుత్వం ఎత్తివేసింది. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్‌ తప్పనిసరి నిబంధనను కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో దేశంలో గత కొంతకాలంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబరు ప్రారంభంలో చైనా కోవిడ్ నియంత్రణలను సడలించింది. అప్పటి నుండి కేవలం 1,20,000 మంది ప్రజలకు కరోనా సోకినట్లు.. 30 మంది మరణించినట్లు అధికారిక డేటాలో ఉంది.

Read Also: Israel Protest : అట్టుడుకుతున్న ఇజ్రాయెల్.. రోడ్లను దిగ్బంధించిన నిరసనకారులు

కరోనా బారిన పడిన వారు భారత ఔషధాల కోసం ఫార్మసీలకు క్యూ కడుతున్నారు. చైనా ఈ ఫార్మసీల్లో నాలుగు రకాల కోవిడ్ జనరిక్ ఔషధాలను విక్రయిస్తున్నారు. ప్రిమోవిర్, పాక్సిస్టా, మోల్నునాట్, మోల్నాట్రిస్.. ఇవన్నీ భారత కంపెనీలు తయారు చేసినవి. ఇందులో ప్రిమోవిర్, పాక్సిస్టా రెండూ పాక్స్ లోవిడ్ జనరిక్ రూపాలు, మిగిలిన రెండూ మోల్నిపిరావిర్ జనరిక్ మందులు. ఈ నాలుగు ఔషధాలూ భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతించినవని, చైనాలో వీటి వాడకం చట్టబద్ధం కాదని అక్కడి అధికార యంత్రాంగం హెచ్చరించింది. ఒక్క భారత్ నుంచే మేము అందుబాటు ధరలకు, కచ్చితమైన ఫలితాలతో కూడిన ఔషధాలను పొందగలమని బీజింగ్ మెమోరియల్ ఫార్మాస్యూటికల్ హెడ్ జియోబింగ్ పేర్కొన్నారు.