Site icon NTV Telugu

Cruise Ship: క్రూజ్‌ షిప్‌లో కరోనా కలకలం.. 800 మందికి పాజిటివ్

Cruise Ship

Cruise Ship

Cruise Ship: చైనాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చినట్లే కనిపించినా అప్పుడప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ క్రూజ్‌ షిప్‌లో 800 కరోనా బాధితులు ఉన్న ఓ క్రూజ్ నౌకను ఆస్ట్రేలియాలోని సిడ్నీ తీరంలో నిలిపివేశారు. కార్నివాల్ ఆస్ట్రేలియాకు చెందిన మేజెస్టిక్‌ ప్రిన్సెస్‌ క్రూజ్‌ షిప్‌ అనే నౌక న్యూజిలాండ్‌ నుంచి 4,600 మంది ప్రయాణికులు, సిబ్బందితో కలిసి బయలుదేరింది. 12 రోజుల సముద్రయానంలో భాగంగా సగం ప్రయాణంలో భారీ ఎత్తున కేసులు వెలుగుచూశాయని క్రూజ్ షిప్‌ నిర్వాహక సంస్థ కార్నివాల్‌ ఆస్ట్రేలియా వెల్లడించింది. వైరస్ బారినపడిన కొందరిలో లక్షణాలు కనిపించడం లేదని, మరికొందరిలో వ్యాధి తీవ్రత స్వల్ప స్థాయిలో ఉందని పేర్కొంది.

World Highest Polling Station: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రం.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌ ఉంచామని, వారికి తగిన సదుపాయాలు కల్పించామని కార్నివాల్‌ ఆస్ట్రేలియా తెలిపింది. అలాగే ఈ నౌక త్వరలో మెల్‌బోర్న్‌కు చేరుకుంటుందని వెల్లడించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. వారం వ్యవధిలో 19,800 కేసులు వచ్చాయి. సిడ్నీలో వందలాది మంది ప్రయాణికుల కరోనా సోకిన నేపథ్యంలో కొవిడ్‌ ప్రోటోకాల్‌ పాటిస్తే సరిపోతుందని ఆస్ట్రేలియా హోం వ్యవహారాల మంత్రి శనివారం ప్రజలకు సూచించారు. 2020లో రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో ఈ తరహా ఘటన ఒకటి చోటుచేసుకుంది. న్యూ సౌత్ వేల్స్‌లో కూడా 914 కేసులు వెలుగు చూడగా.. 28 మరణాలకు దారితీసింది. ఆ క్రూజ్‌ షిప్‌ కూడా ఇదే కంపెనీకి చెందనది కావడం గమనార్హం.

Exit mobile version