NTV Telugu Site icon

SLBC Incident : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్న 8మంది సజీవ సమాధి

Slbc

Slbc

SLBC Incident : తెలంగాణలోని SLBC (శ్రీశైలం లిఫ్ట్ బకింగ్ కెనాల్) టన్నెల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచే అధికారులు, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి క్షతగాత్రుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మట్టిలో వారు మూడు మీటర్ల లోతులో కూరుకుపోయినట్లు అధునాతన పరికరాలు సూచించాయి.

 

గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ మెషీన్ ద్వారా మట్టి లో కూరుకుపోయిన 5 మృతదేహాలు గుర్తించారు. ఈ 5 మృతదేహాలను వెలికి తీయడానికి మరింత సమయం పడుతుందని, కొన్ని మీటర్ల లోతు మట్టి లో మృతదేహాలు కూరుకు పోయినట్లు తెలుస్తోంది. మిగతా ముగ్గురి మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలిస్తున్నారు అధికారులు.

ప్రమాద స్థలంలో రక్షణ చర్యలను వేగవంతం చేసేందుకు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) రంగంలోకి దిగింది. భూమిలో కూరుకుపోయిన వారి స్థితిని తెలుసుకునేందుకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది. జీరో గ్రావిటీ పెనట్రేటింగ్ రాడార్ (GPR) టెక్నాలజీని ఉపయోగించి, భూమిలోకి తొలగిపోయిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందం శ్రమిస్తోంది. మిషన్ ఆధారంగా ఎన్జీఆర్‌ఐ బృందం టన్నెల్‌ను పూర్తిగా స్కాన్ చేసింది.

NGRI టీమ్, GPR సాయంతో టన్నెల్‌లో ఐదు అనుమానాస్పద ప్రదేశాలను గుర్తించింది. ఈ ప్రాంతాల్లో శరీర నిఘా కోసం మార్కింగ్ నిర్వహించారు. రక్షణ బృందాలు ఆచూకీని కనుగొని, బాధితుల మృతదేహాలను వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.