Tamilnadu : తమిళనాడులో విషాదం.. ట్రోల్స్ తట్టుకోలేక ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా కొందరికి ఉపకారి కాగా మరికొందరి అపకారిగా మారుతోంది. కొందరు సోషల్ మీడియా కారణంగా ప్రాణాలు పొగొట్టుకున్న ఘటనలు కోకొల్లలు. మూడు వారాల కిందట చెన్నైలో ఒక చిన్నారి అపార్ట్మెంట్లో ఉన్న షెడ్‌పై పడిపోయింది. ఆ చిన్నారి షెడ్ చివర్లో చాలా సమయం అలాగే ఆగిపోయింది. గమనించిన ఇరుగుపొరుగు వెంటనే స్పందించారు. చాలా కష్టపడి ఆ చిన్నారిని రక్షించారు. కిటికీ లోనుంచి ఇద్దరు వ్యక్తులు నిలబడి షెడ్‌పై ఉన్న చిన్నారిని కాపాడారు. ఇక మరోవైపు ఆ పాప ఎక్కడ కిందపడిపోతుందన్న భయంతో కాపాడేందుకు స్థానికులు దుప్పట్లు, బెడ్షీట్లను పరిచి రెడీగా ఉన్నారు. చివరకు ఆ చిన్నారిని కిటికీలో నుంచి ఇద్దరు వ్యక్తులు కిందకు దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Also:NTR : ఎన్టీఆర్ బర్త్ డే.. జపాన్ లేడీ ఫ్యాన్స్ మాస్ సెలెబ్రేషన్స్..
Also Read
- Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
ఈ సంఘటన చెన్నై అవాడీలోని ఓ అపార్ట్మెంట్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఎలాగోలా ఆ చిన్నారిని కాపాడిన వ్యక్తులను మెచ్చుకున్నారు. ఇదే సమయంలో ఎనిమిది నెలల చిన్నారిని నిర్లక్ష్యంగా వదిలేసిన తల్లిని ఆడిపోసుకున్నారు. పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలంటూ బండబూతులు తిట్టారు. తల్లి నిర్లక్ష్యం కారణంగానే పసికందు ఈ ప్రమాదంలో పడిందంటూ ఆరోపించారు. ఇక స్థానికులు కొందరు స్పందించి.. ఇది అనుకోకుండా జరిగిందనీ.. తల్లి తప్పేమీ లేదని చెప్పినా కొందరు ట్రోలర్స్ ఊరుకోలేదు. పసికందు తల్లి రమ్యను ట్రోల్ చేస్తూ భయంకరమైన కామెంట్స్ చేశారు. తల్లి పాపను చూసుకోవడంలో ఫెయిల్ అయిందంటూ తిట్టిపోశారు.
Read Also:Tirupati: ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా చూస్తాం..
కాగా.. ఇటీవల రమ్య తన పాపను తీసుకుని కరమదాయ్లోని తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఆదివారం ఆమె తల్లిదండ్రుల ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ఇక వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు ప్రకటించారు. తాజాగా ఈ సంఘటనపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. నటుడు ప్రశాంత్ రంగస్వామిపై ఆమె ఆగ్రహం వ్యక్తం అయ్యారు. రమ్యను వీడియో వైరల్ అయిన సమయంలో తిట్టడం వల్లే ఆత్మహత్య చేసుకుందంటూ ఆరోపించారు. ప్రశాంత్ లాంటి వ్యక్తులు.. ఈ వీడియో కింద ఎవరైతే తల్లిదండ్రులను అవమానించారో.. వారంతా ఇప్పుడు పండగ చేసుకోవచ్చని ట్విటర్ వేదికగా ఆమె రాసుకొచ్చారు.
அந்த குழந்தையை பெற்றவர்களுக்கு – உங்களுக்கு கொழந்த ஒரு கேடாடா ? pic.twitter.com/0FUskMECMf
— Prashanth Rangaswamy (@itisprashanth) April 28, 2024
తాజావార్తలు
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
ట్రెండింగ్
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!