Site icon NTV Telugu

Stone Quarry Collapse: కుప్పకూలిన స్టోన్‌ క్వారీ.. 8 మంది వలస కూలీలు దుర్మరణం

Stone Collapse

Stone Collapse

Stone Quarry Collapse: మిజోరాంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం స్టోన్ క్వారీ కుప్పకూలింది. కార్మికులు మధ్యాహ్నం అన్నం తిని వచ్చిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 12 మంది కూలీల‌తో పాటు హిటాచి డ్రైవ‌ర్లు క్వారీ లోప‌ల చిక్కుకుపోయారు. వాళ్లను కాపాడేందుకు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. న‌య్‌థియాల్ జిల్లాలోని మౌద‌ర్హ్ అనే గ్రామంలో ఉన్న ఏబీసీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన క్వారీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రాష్ట్ర విప‌త్తు నివార‌ణ బృందాలతో పాటు స‌రిహ‌ద్దు భ‌ద్రతా ద‌ళాలు, అస్సాం రైఫిల్స్ రెస్య్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి.

World Population: 8 బిలియన్లకు ప్రపంచ జనాభా.. చైనాను అధిగమించనున్న భారత్!

చిక్కుకున్న ఎనిమిది మంది వలస కూలీల మృతదేహాలను మంగళవారం అధికారులు వెలికితీశారు. చిక్కుకున్న మరో నలుగురు కూలీల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. “పోస్టుమార్టం పరీక్ష తర్వాత మృతదేహాలను గుర్తించడం జరుగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. తప్పిపోయిన వారందరినీ కనుగొనే వరకు కొనసాగుతుంది” అని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఒక ప్రకటనలో తెలిపింది.మిజోరాంలో సోమవారం రాతి క్వారీ కూలిపోవడంతో 12 మంది కూలీలు చిక్కుకుపోయారు. ప్రమాదం విష‌యం తెలిసిన వెంట‌నే స‌హాయ‌ం చేసేందుకు చుట్టుప‌క్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున స్థానికులు త‌ర‌లివ‌చ్చారు. స్టోన్ క్వారీ శిథిలాల్లో చిక్కుకున్న 12 మంది కూలీలు బీహార్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. ఈ క్వారీలో రెండున్నర ఏళ్లుగా పనులు కొనసాగుతున్నాయి.

Exit mobile version