Blast at Cracker Factory in Kanchipuram: తమిళనాడులోని కాంచీపురంలో ఇవాళ ఘోర పేలుడు సంభవించింది. కాంచీపురంలోని కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనం అయ్యారు. దాదాపు 16 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగేలా కనిపిస్తోంది. పేలుడు ధాటికి మృతుల శరీర భాగాలు తునాతునకలయ్యాయి. పేలుడు తీవ్రతకు నాలుగు ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అత్యంత తీవ్రంగా గాయపడిన మహిళలను అధికారులు కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also: PM Modi: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొవిడ్‌పై ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు పాతిక మందికి పైగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు, ఘటనకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు.