Gun Fire : మెక్సికోలో మరోసారి గన్ ఫైర్.. 8మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Fire : మెక్సికో సిటీలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. తాజాగా ఉత్తర మెక్సికోలోని జెరెజ్ పట్టణంలో రద్దీగా ఉండే నైట్‌క్లబ్‌లో ఓ దుండగులు తెగబడ్డారు. వారు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించగా, ఐదుగురు గాయపడ్డారని పోలీసులు ఆదివారం తెలిపారు. జకాటెకాస్ రాష్ట్రంలో ఈ సంఘటన శనివారం అర్థరాత్రి జరిగింది. భారీగా ఆయుధాలు ఉన్న వ్యక్తులు, రెండు వాహనాలలో బార్‌కు వచ్చారు. అనంతరం బార్ లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మేరకు భద్రతా సెక్రటేరియట్ నివేదిక తెలిపింది.
Read Also: Chicken Theft : పాక్‌లో ఆకలి తట్టుకోలేక కోళ్లను ఎత్తుకెళ్లిన ప్రజలు.. లబోదిబోమంటున్న యజమాని
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. అదే సమయంలో కాల్పుల్లో గాయపడిన ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో క్లబ్ ఉద్యోగులు, సంగీతకారులు, కస్టమర్లు కూడా ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. క్లబ్ ఫ్లోర్ రక్తంతో నిండిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Read Also: Hockey : హాకీ ప్రపంచ చాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్న జర్మనీ
‘ఎల్ వెనాడిటో’ అని పిలువబడే బార్, రాష్ట్ర రాజధాని నగరం జకాటెకాస్‌కు నైరుతి దిశలో 60 కిలోమీటర్ల (36 మైళ్ళు) దూరంలో ఉన్న మునిసిపాలిటీ అయిన జెరెజ్ మధ్యలో ఉంది. గత ఏడాది జెరెజ్లో భారీ హింస జరిగింది. సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లోని వందలాది మంది నివాసితులు తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!