సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ బ్యాచ్ ఐపీఎస్‌లకు శిక్షణ పూర్తయింది. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు పూర్తయింది. పాసింగ్ అవుట్ పరేడ్‌కు బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్‌సింగ్ చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఐపీఎస్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. బెస్ట్ అర్చివర్స్, ప్రతిభ కనబరిచిన ట్రైనీ ఐపీఎస్‌లకు అవార్డులు, రివార్డులు అందించారు.
పరేడ్ కమాండర్‌గా శిక్షణ ఐపీఎస్ అంజిత్ ఏ నాయర్ వ్యవహరించారు. 49 వారల పాటు కఠిన శిక్షణ టెక్నికల్, నాన్ టెక్నీకల్ ఇండోర్ అండ్ ఔట్ డోర్ ఐపీఎస్‌ల శిక్షణ పూర్తయింది. 190 మంది ఆఫీసర్‌లకు హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ ఇటీవలే పూర్తయింది. ఇందులో 174 ఐపీఎస్ ఆఫీసర్లు, 16 మంది ఇతర దేశాలకు చెందిన ఆఫీసర్లు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 62 మంది మహిళా ఆఫీసర్లు, 112 మంది పురుష ఐపీఎస్‌లు ఉన్నారు. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిలో ఇంజనీరింగ్ చదివిన వారు (87 మంది) 50 శాతం మంది ఉన్నారు. ఆర్ట్స్ విభాగానికి చెందిన వారు 29 మంది, ఎంబీబీఎస్ 8, లా చదివిన వారు ఆరుగురు, సైన్స్ విభాగానికి చెందినవారు 36 మంది ఉన్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లలో తెలంగాణకు నలుగురు, ఏపీకి నలుగురిని కేటాయించారు. తెలంగాణకు ఇద్దరు మహిళా ఐపీఎస్‌లు, ఏపీకి ఒక మహిళ ఐపీఎస్ కేటాయించారు. 77 బ్యాచ్‌లో అత్యధికంగా 36.63 (62 మంది) శాతం మహిళలు ఉన్నారు. 77వ ఐపీఎస్ బ్యాచ్ శిక్షణలో 25 సంవత్సరాలు వయసు లోపు ఉన్నవారు 21 మంది ఉన్నారు. 25 ఏళ్ల వయసులోపు ఉన్నవారిలో ఏడుగురు మహిళలు, 14 మంది పురుష ఐపీఎస్‌లు ఉన్నారు. ఇప్పటివరకు సర్దార్ వల్లభాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో 6476 మంది ఐపీఎస్‌లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో 380 మంది ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు.
