Site icon NTV Telugu

Boat Capsized: ఘోర పడవ ప్రమాదం.. 76 మంది మృతి

Boat Accident

Boat Accident

Boat Capsized: నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రంలో పెనువిషాదం చోటుచేసుకుంది. వరదల కారణంగా పడవ మునిగిన ఘటనలో దాదాపు 76 మంది ప్రాణాలు కోల్పోయారు. 85 మందితో వెళ్తున్న పడవ వరదల కారణంగా ఒక్కసారిగా బోల్తాపడి మునిగిపోవడమే ఇందుకు కారణం. పడవ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. పడవ ప్రమాదంపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్‌ బుహారీ విచారం వ్యక్తం చేశారు.

Tallest Tree: ఫలించిన మూడేళ్ల నిరీక్షణ.. అమెజాన్‌లో ఆ చెట్టును చేరుకున్న శాస్త్రవేత్తలు

“రాష్ట్రంలోని ఓగ్బారు ప్రాంతంలో వరదలు పెరగడంతో 85 మంది ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది, 76 మంది మరణించినట్లు అత్యవసర సంస్థలు ధ్రువీకరించాయి” అని నైజీరియా ప్రెసిడెన్సీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదం వార్త తెలియగానే, నైజీరియా ప్రభుత్వం రెస్క్యూ, రికవరీ మిషన్లను వేగవంతం చేసింది. ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లాల్సిందిగా అన్ని ఇతర రెస్క్యూ, రిలీఫ్ ఏజెన్సీలను అధ్యక్షుడు ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు ఈ ఫెర్రీలలో భద్రతా ప్రోటోకాల్‌లను తనిఖీ చేయాలని సంబంధిత ఏజెన్సీలను ఆయన ఆదేశించారు. “మృతుల ఆత్మకు శాంతి కలగాలని, ప్రతి ఒక్కరి భద్రత కోసం నేను ప్రార్థిస్తున్నాను, అలాగే ఈ విషాద ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను” అని అధ్యక్షుడు బుహారీ అన్నారు.

Exit mobile version