NTV Telugu Site icon

Noida: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డ మహిళ.. రూ.1.3 కోట్లు అపహరణ

Che

Che

సైబర్ మోసాలు రోజు రోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. అమాయక వ్యక్తుల్ని టార్గె్ట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా నోయిడాకు చెందిన ఓ మహిళ ఖాతా నుంచి రూ.1.3 కోట్లు అపహరించారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Kejriwal: బెయిల్ ఆర్డర్‌ స్టేపై సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్

శుచి అగర్వాల్(73) అనే మహిళ నోయిడాలోని సెక్టార్ 49లో నివాసం ఉంటుంది. అయితే ముంబైలో అక్రమ వస్తువులతో కూడిన పార్శిల్ స్వాధీనం చేసుకున్నామని.. ఆమెను మభ్యపెట్టి రూ.1.3 కోట్లు బ్యాంక్ ఖాతా నుంచి తస్కరించారు. దీంతో ఆమె లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. జూన్ 13న గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ నేరగాళ్లు బెదిరిస్తూ డబ్బును బదిలీ చేయించుకున్నారని వాపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Viral News: మీరు పునర్జన్మను నమ్ముతారా?.. ఈ ఐదేళ్ల బాలిక మాటలు వింటే ఆశ్చర్యపోతారు..

Show comments