Site icon NTV Telugu

Love Story: లేటు వయసులో ఘాటు ప్రేమ.. 35 ఏళ్ల ఆంటీని పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత..

Love

Love

Love Story: ప్రేమకు వయస్సు లేదని అంటారు.. ఒక వ్యక్తి ఏ వయసులోనైనా ప్రేమలో పడుతాడు. అప్పుడు ఈ ప్రేమ జంటలు వయస్సు, సమాజం సంకెళ్ల నుంచి విముక్తి పొందుతారు… అలాంటి ఒక ప్రేమకథ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బిలాస్‌పుర్‌లో నుంచి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 70 ఏళ్ల వృద్ధుడు 35 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. సర్కండలోని చింగరాజపర అటల్ ఆవాస్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

READ MORE: AP Politics : లులూ సంస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం..!

70 ఏళ్ల దాదు రామ్ గంధర్వ అదే ప్రాంతంలో నివసిస్తున్న 35 ఏళ్ల మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆ మహిళ కూడా అతని ప్రేమను అంగీకరించింది. దీంతో వారి ప్రేమ వికసించింది. ఇద్దరూ వివాహం చేసుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. పొరుగున ఉన్న శివాలయంలో, దేవుడిని సాక్షిగా ఏడడుగులు నడిచారు. పూలమాల మార్చుకున్నారు. ఈ అసాధారణ ప్రేమ వివాహాన్ని పొరుగు ప్రాంతానికి చెంది వాళ్లు సైతం తిలకించారు. ఈ వివాహానికి హజరై కొత్త వివాహానికి అభినందనలు తెలిపారు. అయితే.. దాదు రామ్ దినసరి కూలీ, కష్టపడి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ వయసులో కూడా అతని హృదయంలో ప్రేమ రగిలింది. మరోవైపు, 35 ఏళ్ల ఆ మహిళ వయసులో తేడాను పట్టించుకోకుండా దాదు రామ్‌తో కలిసి ఉండాలని ఎంచుకుంది. వారు ఎలా కలిశారో వారికి మాత్రమే తెలుసు, కానీ వారి ప్రేమ అందరినీ ఆశ్చర్యపరిచింది.

Exit mobile version