NTV Telugu Site icon

Air India Flights: సిబ్బంది సిక్ లీవ్.. 70 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు..

Air India

Air India

Air India Express: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థకు చెందిన సీనియ‌ర్ సిబ్బంది ఒకేసారి సిక్ లీవ్ పెట్టారు. దీంతో మంగ‌ళ‌వారం నాడు రాత్రి నుంచి ఇవాళ (బుధ‌వారం) తెల్లవారుజాము వరకు సుమారు 70 విమానాల‌ను ర‌ద్దు చేసింది. ఇందులో అంత‌ర్జాతీయ‌, దేశీయ విమానాలు కూడా ఉన్నాయి. క్యాబిన్ సిబ్బందికి చెందిన కొంత మంది ఉద్యోగులు చివ‌రి నిమిషంలో సిక్ లీవ్ తీసుకోవడంతో గ‌త రాత్రి నుంచి విమానాల రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు.

Read Also: Smriti Irani : రామమందిరంపై ప్రకటన.. ఎస్పీ నేతపై విరుచుకుపడ్డ స్మృతి ఇరానీ

ఉద్యోగులు అందరు ఒకేసారి సిక్ లీవ్‌లో వెళ్లారో తెలియ‌డం లేద‌ని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. విమాన‌ల ర‌ద్దు వ‌ల్ల ఇబ్బందులు పడిన వారికి రిఫండ్ ఇస్తున్నామని పేర్కొనింది. లేదంటే జ‌ర్నీ రీషెడ్యూల్ చేయ‌డం జ‌రుగుతుంద‌ని ఎయిర్ ఇండియా వెల్లడించింది. అయితే, గతంలో వైపు టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌లైన్ మేనేజ్‌మెంట్ తో క్యాబిన్ క్రూ సభ్యుల మధ్య వివాదాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించినందుకు డిసెంబర్ 2023లో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది.