Site icon NTV Telugu

Accident: గంగోత్రి నుంచి వస్తుండగా లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ఏడుగురు దుర్మరణం

Uttarakhand

Uttarakhand

Accident: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఆదివారం గుజరాత్‌కు చెందిన యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో ఏడుగురు మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. 35 మందితో ప్రయాణిస్తున్న బస్సు గంగోత్రి నుంచి తిరిగి వస్తుండగా గంగ్నాని వద్ద ప్రమాదానికి గురైంది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా గుజరాత్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రమాదంపై ఉన్నతాధికారులతో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

Read Also: Onion: కిలో ఉల్లి రూ.25కే.. రేపట్నుంచే విక్రయం

స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), వైద్య బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని, అవసరమైనప్పుడు సహాయం అందించేందుకు డెహ్రాడూన్‌లో హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచామని ఆయన చెప్పారు. ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించాయి.

Exit mobile version