Site icon NTV Telugu

Civil Judge Posts: తెలంగాణ జ్యుడీషియల్‌ సర్వీసులో 66 సివిల్‌ జడ్జి పోస్టులు..

Law

Law

సివిల్ జడ్జి పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్‌ సర్వీసులో సివిల్‌ జడ్జిల(జూనియర్‌ డివిజన్‌) స్థాయిలో 66 పోస్టులను భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 66 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ (సర్వీసు మరియు కేడర్) నియమాలు 2023 మరియు ఆ నియమాలకు జారీ చేయబడిన సవరణలలో నిర్దేశించబడిన అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.

Also Read:Amazon to Invest in India: భారత్ లో 35 బిలియన్ డాలర్ల పెట్టబడి పెట్టనున్నఅమెజాన్

ఆన్‌లైన్‌ పద్ధతిలో అర్హులైన వారినుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్‌ జడ్జిల(జూనియర్‌ డివిజన్‌) పోస్టులకు డిసెంబర్‌ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టుల పరీక్ష తేదీలు, హల్‌టికెట్ల డౌన్‌లోడ్‌, కంప్యూటర్‌ ఆధారిత స్రీనింగ్‌ పరీక్ష తదితర వివరాలను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని రిజిస్ట్రార్‌ వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version