Dog Dispute: తమిళనాడులో ఘోరం జరిగింది. కుక్కలకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయింది. కుక్కను కుక్క అని పిలిచినందుకు వృద్ధుడిని కొట్టి చంపారు. సాధారణంగా పెంపుడు కుక్కల విషయంలో బంధువుల మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానై ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. దిండిగల్ జిల్లాలోని తాడికొంబులో 65 ఏళ్ల రాయప్పన్ ఉంటున్నాడు. పొరుగింట్లో డేనియల్, విన్సెంట్ ఉంటున్నారు. వీళ్లు బంధువులే. కానీ డేనియల్, విన్సెంట్ పెంచుకుంటున్న కుక్కల విషయంలో రాయప్పన్ తో తరచూ గొడవలు జరుగుతున్నాయి. అటువైపు వెళ్లే వారిపై కుక్కలు దాడి చేస్తున్నాయని రాయప్పన్ పలుమార్లు ఫిర్యాదు చేశాడు.
Read Also: Love marriage: ప్రేమ వివాహంలో కలతలు.. ముగ్గురు పిల్లలను కన్నతల్లి ఏంచేసిందంటే..
అయితే వాటిని కుక్కలు అనొద్దని, పేర్లు ఉన్నాయని, ఆ పేర్లతో పిలవాలని డేనియల్, విన్సెంట్ చాలా సార్లు చెప్పారు. కానీ రాయప్పన్ పట్టించుకోలేదు. రాయప్పన్ కుక్కలను వాటి పేర్లతో పిలవడానికి నిరాకరించాడు… కుక్కలను పట్టుకొని ఉంచాలని చెప్పడంపై గొడవ మొదలైంది. దీంతో గత గురువారం నాడు మాటామాటా పెరిగి గొడవ పెద్దదైంది.. కుక్కలను కొట్టేందుకు రాయప్పన్ కర్ర తీసుకువచ్చాడు. దీంతో కోపోద్రిక్తులైన విన్సెంట్, డేనియల్.. రాయప్పన్ పై దాడి చేశారు. దెబ్బలకు తాళలేక రాయప్పన్ స్పృహ తప్పిపడిపోయాడు. కొద్ది సేపటికే చనిపోయాడు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. తాడికొంబు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.
Read Also: Tollywood: వైజాగ్ లో తెలుగు నటుడి ఆత్మహత్య!