NTV Telugu Site icon

Nigeria: ఘోర ప్రమాదం.. నదిలో పడవ మునిగి 64 మంది రైతుల మృతి

Nigeria

Nigeria

నైజీరియాలోని జంఫారాలో నదిలో శనివారం జరిగిన పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 64 మంది మరణించారు. రైతులను పొలాలకు వెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది. వాయువ్య నైజీరియాలోని జంఫారా రాష్ట్రం గుమ్మి పట్టణ సమీపంలో శనివారం ఉదయం 70 మంది రైతులను పొలాల్లోకి దించేందుకు వెళ్తున్న చెక్క పడవ అకస్మాత్తుగా బోల్తా పడింది. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే.. స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల తర్వాత, ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. “గుమ్మి స్థానిక ప్రభుత్వ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి” అని సహాయక చర్యలకు నాయకత్వం వహించిన స్థానిక నిర్వాహకుడు అమీను నుహు ఫలాలే తెలిపారు.

READ MORE: Israel Attack In Gaza : గాజాలో విధ్వంసం సృష్టించిన ఇజ్రాయెల్.. దాడిలో 14 మంది మృతి

900 మందికి పైగా రైతులు తమ పొలాలకు చేరుకోవడానికి ప్రతిరోజూ నదిని దాటడంపై ఆధారపడతారు. అయితే రెండు పడవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని ఫలితంగా తరచుగా రద్దీ పెరుగుతుందని స్థానిక పాలకుడు చెప్పారు. అవి కూడా చెక్క పడవలు కావడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఖనిజ వనరులపై నియంత్రణ కోరుతూ క్రిమినల్ ముఠాల బారిన పడిన జంఫారా రాష్ట్రం కూడా భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో తీవ్రంగా ప్రభావితమైంది. రెండు వారాల క్రితం వరదలు 10,000 మందికి పైగా నివాసితులను తరలించామని స్థానిక అధికారులు తెలిపారు.

Show comments