Spiritual Township in Tirupati: తిరుపతి నగరంలో 600 ఎకరాల విస్తీర్ణంలో రూ. 3,000 కోట్ల వ్యయంతో మెగా ఆధ్యాత్మిక టౌన్‌షిప్ నిర్మించేందుకు డెల్లా గ్రూప్ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.. తిరుపతిలో త్వరలో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ వివరాలను మంత్రి అనగానికి డెల్లా గ్రూప్ ప్రతినిధులు వివరణాత్మకంగా వివరించారు. ఈ టౌన్‌షిప్‌లో 5 వేల ఏళ్ల హిందూ మత సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబించే ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
Read Also: Amaravati Farmers: రాజధాని ప్రాంత రైతులతో చంద్రబాబు సమావేశం.. రెండవ దశ భూ సమీకరణకు రైతుల అంగీకారం..!
‘వసుదైక కుటుంబం’ పేరుతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్‌షిప్..
డెల్లా గ్రూప్ ప్రతినిధులు ప్రాజెక్ట్ ప్రధాన ఆకర్షణగా ‘వసుదైక కుటుంబం’ (Vasudaik Family) పేరిట ప్రపంచ సేవలు, ధార్మిక అధ్యయనం, సాంస్కృతిక వారసత్వ ప్రదర్శనలు, వసతి, విద్య, వినోదం వంటి సేవలను ఒకేచోట ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కేవలం నిర్మాణ ప్రణాళిక కాకుండా, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసే గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. త్వరిత అనుమతుల కోసం మంత్రి హామీ ఇచ్చారు.. ప్రతినిధుల విజ్ఞప్తికి స్పందించిన మంత్రి అనగాని మాట్లాడుతూ.. ఈ భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్ట్‌ను రాష్ట్రం స్వాగతిస్తోంది. టౌన్‌షిప్ నిర్మాణానికి కావాల్సిన అనుమతులు త్వరగా లభించేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.. అలాగే, ఈ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కూడా చర్చిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.
ఈ ప్రాజెక్ట్‌తో తిరుపతికి కొత్త గుర్తింపు వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు అనగాని.. ఈ టౌన్‌షిప్ నిర్మాణం పూర్తయితే.. ఆధ్యాత్మిక టూరిజం, అంతర్జాతీయ పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు, సాంస్కృతిక-పర్యాటక అభివృద్ధి.. వంటి రంగాల్లో తిరుపతి కొత్త స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.
