గ్రూప్-1లో మరో 60 పోస్ట్‌ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా 60 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలో రిక్రూట్‌మెంట్ పరీక్షను నిర్వహించనుందని ఆ ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు, నియామక ప్రక్రియ ను వేగంగా చేయాలని సర్వీస్ కమిషన్ ను కోరింది ప్రభుత్వం. ఇప్పటికే 503 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వేసింది టీఎస్పీఎస్సీ. అయితే.. సుప్రీం కోర్టు లో ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ ఇష్యూ ఉండటంతో.. వాటితో కలిపి మళ్ళీ నోటిఫికేషన్ వేస్తారా లేక ఈ 60 పోస్ట్ ల భర్తీకి వేరే నోటిఫికేషన్ ఇస్తారా సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇచే అవకాశం ఉంది. కొత్త 60 పోస్ట్ ల భర్తీకి సంబంధించి రిజర్వేషన్, రోస్టర్, తదితర వివరాలను ఆయా డిపార్ట్ మెంట్ ల నుండి తెప్పించుకోవాలని సర్వీస్ కమిషన్ ను కోరింది ప్రభుత్వం.
ప్రభుత్వం ప్రతిపాదించిన 60 పోస్టులు ఇలా ఉన్నాయి.
- ఆర్థిక శాఖ నుండి: అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ – పోస్టుల సంఖ్య – 1
- హోం శాఖ నుండి: డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ – పోస్టుల సంఖ్య – 24
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ – పోస్టుల సంఖ్య – 3
- కార్మిక మరియు ఉపాధి శాఖ నుండి: జిల్లా ఉపాధి అధికారి – పోస్టుల సంఖ్య – 3
- పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ నుండి: మండల పరిషత్ అభివృద్ధి అధికారి – పోస్టుల సంఖ్య – 19
- జిల్లా పంచాయతీ అధికారి – పోస్టుల సంఖ్య – 3
- రెవెన్యూ శాఖ నుండి: డిప్యూటీ కలెక్టర్ – పోస్టుల సంఖ్య -3
- అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ – పోస్టుల సంఖ్య – 4
- జిల్లా రిజిస్ట్రార్ (రిజిస్ట్రేషన్) – పోస్టుల సంఖ్య – 1
