Site icon NTV Telugu

Marijuana: 60 కేజీల గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్ట్

Arrest

Arrest

ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు అరవై కేజీల గంజాయి, ఎర్టిగా మారుతి కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ఆర్ గంగాధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..
అందిన సమాచారం మేరకు పొట్టిపాడు టోల్ గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఈనెల 20వ తారీఖున ఎస్సై సురేష్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు.. అనంతరం ఉంగుటూరు తాసిల్దార్ సమక్షంలో పూర్తి తనిఖీలు నిర్వహించి కారులో మూడు బస్తాల గంజాయి బ్యాగులు ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారని తెలిపారు.

Also Read:Vallabhaneni Vamsi: వంశీని మూడు గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు..

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు శివారు సివిడి మామిడికి చెందిన వ్యక్తి వద్ద నుండి గంజాయి తరలిస్తున్నారు.. గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసాం.. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కర్ణాటక రాష్ట్రం తరలిస్తుండగా మార్గ మధ్యలో పొట్టిపాడు టోల్‌గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నాం.. 60 కేజీల గంజాయిని, ఎర్టిగా మారుతి కారును పట్టుబడ్డ ముగ్గురు నిందితులను కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు.

Exit mobile version