Indian Navy : అరేబియా సముద్రంలో కార్గో షిప్‌ను హైజాక్ చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టినట్లు భారత నావికాదళం శనివారం వెల్లడించింది. 18 మంది సిబ్బందితో మాల్టా ఫ్లాగ్‌తో కూడిన కార్గో షిప్ ఎంవీ రూవెన్‌ను ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు స్వాధీనం చేసుకున్నారని, అయితే ఇది తెలిసిన వెంటనే భారత నేవీ బృందం వెంటనే స్పందించినట్లు తెలిపింది. ఐరోపా ద్వీప దేశమైన మాల్టాకు చెందిన కార్గో షిప్ అరేబియా సముద్రంలో హైజాక్ చేయబడింది. సోమాలియా వెళ్తున్న ఎంవీ రుయెన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ నౌక నుంచి మేడే(అత్యవసర పరిస్థితి) కాల్ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది. దానిని కాపాడేందుకు విమానాలు, యుద్ధనౌకలు రంగంలోకి దిగాయి. ఈ విషయాన్ని భారత నౌకాదళం శనివారం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
Read Also:Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ గ్యాప్ లో వెకేషన్… సినిమా రిలీజైతే సెన్సేషనే
“డిసెంబర్ 14 రాత్రి సమయంలో, ఓడ MV Ruen UK మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) పోర్టల్‌లో మేడే సందేశాన్ని పంపింది. ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఓడలోకి ఎక్కినట్లు సందేశం పేర్కొంది. దీనిపై భారత నావికాదళం వేగంగా స్పందించింది. నావల్ మారిటైమ్ అరేబియా సముద్రంలో గస్తీ తిరుగుతున్న పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో విధులు నిర్వహిస్తున్న యాంటీ పైరసీ పెట్రోలింగ్ యుద్ధనౌకను అప్రమత్తం చేసినట్లు నేవీ తెలిపింది. హైజాక్‌కు గురైన ఓడలో 18 మంది సిబ్బంది ఉన్నారు. యుకె మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ వారు నౌకపై నియంత్రణ కోల్పోయారని వెల్లడించారు. భారత నౌకాదళానికి చెందిన ఒక విమానం మరియు ఒక యుద్ధనౌక రూయెన్ నౌకకు సహాయంగా అక్కడికి చేరుకుంది. ప్రస్తుతం సోమాలియా తీరం వైపు పయనిస్తోంది. దాని పైన నావికాదళ విమానం ఎగురుతోంది. మరోవైపు, ఈ ఉదయం రోవెన్ నౌకను భారత యుద్ధ నౌక విజయవంతంగా అడ్డుకున్నట్లు నేవీ తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు.
2017 తర్వాత ఓడలపై సోమాలియా సముద్రపు దొంగలు జరిపిన భారీ దాడి ఇదే.. ఈ నేపథ్యంలోనే అరేబియా సముద్రంలో ప్రయాణించే నౌకలకు యూకే నేవీ హెచ్చరికలు పంపింది. సోమాలియా తీరం సమీపంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పరిస్థితులు అనుమానాస్పదంగా ఉంటే తక్షణమే రిపోర్ట్ చేయాలని తెలిపింది.