NTV Telugu Site icon

AP Elections 2024: ఏపీలో క్రమంగా పెరుగోతన్న ఓటింగ్‌.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతంటే..?

Ap

Ap

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా ఓటింగ్‌ శాతం పెరుగుతోంది.. మరోవైపు పోలింగ్‌ స్టేషన్ల ఎదుట పెద్ద సంఖ్యలో క్యూలు దర్శనం ఇస్తుండడంతో.. భారీగా ఓటింగ్‌ నమోదు అవుతుందనే అంచనాలు నెలకొన్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం మేర పోలింగ్ నమోదు అయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు వస్తున్న ఓటర్లు.. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఏపీ సీఈవో ఎంకే మీనా.. ఇక, రాష్ట్రంలోని ఆయా జిల్లాల వారీగా పోలింగ్‌ శాతాన్ని పరిశీలించినట్లు అయితే..

* అల్లూరి జిల్లా – 48.87 శాతం
* అనకాపల్లి – 53.45 శాతం
* అనంతపురం – 54.25 శాతం
* అన్నమయ్య జిల్లా – 54.44 శాతం
* బాపట్ల – 59.49 శాతం
* చిత్తూరు – 61.94 శాతం
* అంబేద్కర్ కోనసీమ -59.73 శాతం
* తూ.గో. జిల్లా – 52.32 శాతం
* ఏలూరు – 57.11 శాతం
* గుంటూరు – 52.24 శాతం
* కాకినాడ – 52.69 శాతం
* కృష్ణా – 59.39 శాతం
* కర్నూలు – 52.26 శాతం
* నంద్యాల – 59.30 శాతం
* ఎన్టీఆర్ జిల్లా – 55.71 శాతం
* పల్నాడు – 56.48 శాతం
* పార్వతిపురం మన్యం – 51.75 శాతం
* ప్రకాశం జిల్లా – 59.96 శాతం
* నెల్లూరు – 58.14 శాతం
* శ్రీ సత్యసాయి జిల్లా- 57.56 శాతం
* శ్రీకాకుళం – 54.87 శాతం
* తిరుపతి – 54.42 శాతం
* విశాఖపట్నం – 46.01 శాతం
* విజయనగరం – 54.31 శాతం
* ప.గో. జిల్లా – 54.60 శాతం
* కడప – 60.57 శాతం పోలింగ్‌ నమోదైంది.

Show comments