Site icon NTV Telugu

5,000 Chickens Burnt In Fire: అగ్నికి ఆహుతైన 5వేల కోళ్లు.. ఏం జరిగిందంటే?

Chickens In Fire

Chickens In Fire

5,000 Chickens Burnt In Fire: హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో పౌల్టీఫారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి పౌల్ట్రీ ఫామ్‌లోని సుమారు 5 వేల కోళ్లు బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో అగ్నికి ఆహతైనట్లు అధికారులు గురువారం వెల్లడించారు. ఈ ఘటన అర్థరాత్రి జరగగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఫారంలో దాదాపు 12 వేల కోళ్లు ఉన్నాయని వారు తెలిపారు. లక్షల్లో నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ ఫారం యజమాని జగ్తార్ సింగ్ తెలిపారు. కొత్త సంవత్సరం నేపథ్యం ఆదాయం వస్తుందని ఆశతో ఉన్నామని, ఈ ప్రమాదంతో ఆశలు అడియాశలయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Bus Accident: 13 మందిని బలిగొన్న ఫిట్‌నెస్ లేని బస్సు.. బీజేపీ నేతకు చెందినదిగా గుర్తింపు

అగ్నిప్రమాదంలో దాదాపు 5,000 చిన్న, పెద్ద కోళ్లు దగ్ధమయ్యాయని, ఆస్తినష్టం వాటిల్లిందని బిజ్రీ అగ్నిమాపక కేంద్రం ఇన్‌ఛార్జ్ బతన్ సింగ్ తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version