NTV Telugu Site icon

Pakistani Terrorists: పాక్ ఉగ్రవాదులను వేటాడేందుకు 500 కమాండోలు..

Indian Army

Indian Army

Pakistani Terrorists: జమ్ము అండ్ కశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ సిబ్బందిపై జరుగుతున్న ఉగ్రదాడులు ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఈ దాడుల్లో భారత సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. జమ్ము, రాజౌరి, పూంచ్, రియాసి, కథువా జిల్లాలు టెర్రరిస్టులకు లక్ష్యంగా చేసుకోవడంతో భద్రతా దళాలు సెర్చ్‌ ఆపరేషన్‌లను చేపడుతున్నాయి. జమ్మూలో శిక్షణ పొందిన పాకిస్తానీ ఉగ్రవాదుల చొరబాటు దృష్ట్యా ఇండియన్ ఆర్మీ ఆ ప్రాంతంలో భారీగా మోహరించి సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తుంది. ఉగ్రవాదులను వేటాడేందుకు దాదాపు 500 మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలను మోహరించినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా తమ చర్యలను వేగవంతం చేసేశాయి. టెర్రరిస్టులకు సపోర్ట్ ఇచ్చే వారిపై నజర్ పెట్టినట్లుగా అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌ దురాక్రమణను ఎదుర్కోవడానికి ఇప్పటికే నాలుగు వేల మంది భద్రతా దళాలను మోహరించామని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

Read Also: Dog Breeding: ఇంట్లో కుక్కలను పెంచుకోవడమే కాదు.. ఇవి కూడా చేయాలి..

కాగా, జమ్ములో ఇటీవల జరిగిన దాడుల్లో ఉగ్రవాదులు పన్నిన గెరిల్లా యుద్ధ వ్యూహాలు, వారి దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధాలను బట్టి వారు సాధారణ ఉగ్రవాదులు కాదని ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. వారిలో ఖచ్చితంగా కొందరు మాజీ పాక్ ఆర్మీ సైనికుల హస్తం ఉండొచ్చని ఇంటలిజెన్స్‌ నుంచి సమాచారం అందుతోంది. మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ ఎస్పీ వైద్ ఈ అంశం గురించి మాట్లాడుతూ.. జమ్ములో ప్రస్తుత పరిస్థితులు భయాందోళనకరంగా ఉన్నాయి.. ఈ టైంలో తక్షణం చర్యలు అవసరమని చెప్పుకొచ్చారు. కొంతమంది పాకిస్థాన్ ఆర్మీ మాజీ సైనికులు స్థానిక ఉగ్రవాద గ్రూపులకు మార్గనిర్దేశం చేస్తున్నారని తెలుస్తుందన్నారు. సోమవారం జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులు, భారత సైనికుల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ అధికారి సహా నలుగురు ఆర్మీ సైనికులు అమర వీరులయ్యారు. మరికొందరు పోలీసులు తీవ్రంగా గాయాల బారిన పడ్డారు.