బ్యాంకు ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఐబీపీఎస్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలా పలు బ్యాంకులు భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అయ్యాయి. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా రిక్రూట్ మెంట్ కు సిద్ధమైంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 500 జనరలిస్ట్ ఆఫీసర్ (స్కేల్ II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకు జాబ్స్ కోసం ట్రై చేస్తు్న్నవారు మిస్ చేసుకోకండి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% మార్కులతో (SC/ST/OBC/PwBD వారికి 55%) ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ కలిగి ఉండాలి.
షెడ్యూల్డ్ పబ్లిక్/ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులో కనీసం 3 సంవత్సరాలు ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. అభ్యర్థుల కనిష్ట వయసు 22 సంవత్సరాలు, గరిష్ట వయసు 35 సంవత్సరాలు కలిగి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 64,820 – రూ. 93,960 జీతం అందిస్తారు. దరఖాస్తు ఫీజు UR/EWS/OBC రూ. 1,180 చెల్లించాలి. SC/ST/PwBD రూ. 118 చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 30 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
