NTV Telugu Site icon

Natural Disaster: మేడారం అడవుల్లో 200 హెక్టార్లలో 50 వేల చెట్లు నేలమట్టం.. కారణం ఇదే..!

Mulugu

Mulugu

ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.. ఈ భారీ వర్షాలకు కనివినీ ఎరుగని రీతిలో నష్టం వాటిల్లింది. ఎక్కడికక్కడ చెరువులు తెగిపోయాయి.. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కొన్ని చోట్ల వరద ప్రవాహానికి రోడ్లు కొట్టుకుపోయాయి. ఇకపోతే.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో భారీ వర్షం తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. అటు.. విజయవాడలోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ.. తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరునాగారంలో ప్రకృతి విపత్తు ఏర్పడింది.

Read Also: Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్ లో 86 ఏళ్ల నటి ర్యాంప్‌ వాక్..

ములుగు జిల్లాలోని ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం, తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన పర్యావరణ విపత్తుపై వర్క్‌షాప్ నిర్వహించారు. విపత్తు జరిగిన రోజు అక్కడ విపరీతమైన గాలులు, భారీ వర్షం ఒకే చోట కురవడం వలన కేవలం ఆ ప్రాంతంలోనే ఎక్కువ నష్టం జరిగింది. NRSC, NARLకి చెందిన శాస్త్రవేత్తలు బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో రెండు ప్రాంతాల్లో ఒకేసారి వాయుగుండం సంభవించడం వలన ఇక్కడ గంటకు 130-140 కిలోమీటర్లు వేగంతో గాలి వీచిందని చెబుతున్నారు. గాలి వీచే దిశ ఈ ప్రాంతంలోనే బలంగా వీయడం వలన ఈ విపత్తు జరిగి ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.

Read Also: Revanth Reddy: పద్మశ్రీ మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన ముఖ్యమంత్రి..

మరోవైపు.. బలమైన మేఘాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైన కారణంగా ఇక్కడ కురిసిన భారీ వర్షపాతం కూడా ఈ విపత్తుకు కారణం. అక్కడ ఉన్న సారవంతమైన నేల కూడా ఈ విపత్తుకు మరో కారణం. ఈ నేలలో చెట్లు త్వరగా ఎదగడం వలన ఆ చెట్టు యొక్క వేర్లు భూమిలో లోతుగా కాకుండా అడ్డంగా వెళ్ళడం కూడా చెట్లు త్వరగా పడిపోవడానికి కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రభావిత ప్రాంతం దాదాపు 332 హెక్టార్లుగా ఉందని, దాదాపు 50వేల చెట్లు నేలకొరిగాయి.