Illegal immigration: పాకిస్థాన్ ప్రభుత్వం చేపట్టిన బహిష్కరణ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటికే 5 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించినట్లు పాక్ హోం మంత్రిత్వ శాఖ పార్లమెంటు ఎగువ సభ (సెనేట్)కి తెలియజేసింది. స్వదేశానికి రప్పించడం, బహిష్కరణ ప్రచారం యొక్క ప్రస్తుత స్థితికి సంబంధించి సెనేటర్ మొహ్సిన్ అజీజ్ ప్రశ్నలకు మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. పాక్ లో దాదాపు 17 లక్షల మంది అక్రమ వలసదారులు నివసిస్తున్నారని, వీరిలో ఎక్కువ మంది ఆఫ్ఘన్‌లు ఉన్నారని వెల్లడించింది. దేశంలో ఉండేందుకు ఎలాంటి చట్టపరమైన పత్రాలు లేకుండానే అక్రమంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ నివాసితుల బహిష్కరణ ప్రణాళికకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత దాదాపు 5 లక్షల 41 వేల 210 మంది బహిష్కరణకు గురయ్యారు అని పాకిస్థాన్ చెప్పుకొచ్చింది. మిగిలిన 1.15 మిలియన్లు ఇప్పటికీ నివాసం ఉంటున్నారు.. ప్రభుత్వం దేశవ్యాప్త బహిష్కరణ ప్రచారంలో భాగంగా మిగిలిన వారిని కూడా స్వదేశానికి పంపించివేయనున్నారు.
Read Also: Arvind Kejriwal: ఈ రోజు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్..? ఆప్ నాయకుల్లో భయాలు..
అయితే, మిగిలిన వారిని గుర్తించి వెనక్కి పంపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. తమ స్వదేశాలకు పంపబడిన 5 లక్షల మంది అక్రమ వలసదారులలో 95 శాతానికి పైగా ఆఫ్ఘన్ పౌరులే ఉన్నారని సోర్సెస్ ధృవీకరించాయి. దశాబ్దాలుగా దేశంలో నివసిస్తున్న దాదాపు 1.7 మిలియన్ల అక్రమ వలసదారులను బహిష్కరించాలని పాకిస్థాన్ లక్ష్యంగా పెట్టుకుంది. చాలా మంది అక్రమ వలసదారులు ఆఫ్ఘన్ పౌరులు, భద్రతా సమస్యల కారణంగా తమ దేశం నుంచి పారిపోయారు.
Read Also: CM Revanth Reddy: నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్
ఇక, ప్రపంచ మానవ హక్కుల సంస్థలు లేదా ఆఫ్ఘన్ ప్రభుత్వం లేవనెత్తిన ఆందోళనలపై స్పందించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం నిరాకరించింది. అక్రమ వలసదారులు ప్రవాహాన్ని తీవ్రవాద గ్రూపులతో పాటు వారి మిలిటెంట్లు దేశంలోకి ప్రవేశించడానికి, దాడులు చేయడానికి ఒక సాధనంగా ఉపయోగించుకున్నారని ఆరోపిస్తున్నారు. అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించేందుకు తమ జాతీయ భద్రత విషయంలో రాజీపడే పరిస్థితి లేదని పాకిస్థాన్ ప్రకటించింది.