Sachin Tendulkar: బ్రేక్ చేయలేని సచిన్ టెండూల్కర్ 5 రికార్డ్స్.. నేటి క్రికెటర్స్ కు కష్టమే..!
- బ్రేక్ చేయలేని సచిన్ టెండూల్కర్ 5 రికార్డ్స్
- రికార్డులు బద్దలు కొట్టడం ఊహించడం కూడా కష్టతరమైన రికార్డులు
- నేటి క్రికెటర్స్ కు కష్టమే అంటున్నారు క్రికెట్ ఎక్స్ పర్ట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచిన్ టెండూల్కర్.. క్రికెట్ హిస్టరీలో రికార్డుల రారాజు. క్రికెట్ లో కలకాలం నిలిచిపోయే ఎన్నో రికార్డులను సచిన్ నెలకొల్పాడు. టీమిండియాకు ఎనలేని పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. భారత గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలువబడే సచిన్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరిగా, అద్భుతమైన బ్యాట్స్ మెన్ గా పేరొందారు. తన బ్యాటింగ్ తో క్రికెట్ లవర్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. యువతకు రోల్ మోడల్ గా నిలిచారు. సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘమైన కెరీర్‌లో నేటి క్రికెటర్లు బద్దలు కొట్టడం కష్టమని నిరూపించే అనేక రికార్డులను క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జో రూట్ వంటి బ్యాట్స్‌మెన్‌లు బద్దలు కొట్టిన అనేక రికార్డులను సచిన్ తన కెరీర్‌లో నెలకొల్పాడు. అయినప్పటికీ, రికార్డులు బద్దలు కొట్టడం ఊహించడం కూడా కష్టతరమైన రికార్డులు ఇంకా చాలా ఉన్నాయి. నేటి క్రికెటర్స్ కు కష్టమే అంటున్నారు క్రికెట్ ఎక్స్ పర్ట్స్.
Also Read:Varanas : పారిస్‌లో ‘వారణాసి’ హిస్టరీ.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు
సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో మొత్తం 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సంఖ్యను ఏ ఆటగాడూ అధిగమించడం దాదాపు అసాధ్యం. అంతర్జాతీయ క్రికెట్‌లోని సుదీర్ఘ ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు ఆయన. ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ ఆండర్సన్ 169 టెస్ట్ మ్యాచ్‌లతో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇది సచిన్ రికార్డు ఎంత ముఖ్యమైనదో చూపిస్తుంది.
క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. వన్డేలు, టెస్టులు కలిపి మొత్తం 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. వీటిలో 49 వన్డే సెంచరీలు, 51 టెస్ట్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ 84 సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు. అయితే, 100 సెంచరీలు చేరుకోవడం రన్ మెషిన్ కి కష్టమే అంటున్నారు.
అత్యధిక పరుగుల రికార్డు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 34,357 పరుగులతో ఆల్ టైమ్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సమీప భవిష్యత్తులో దీనిని అధిగమించే అవకాశం లేదు. యాక్టివ్ బ్యాట్స్‌మెన్‌లలో, విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో ఉన్నాడు.
టెస్ట్‌లలో అత్యధిక ఫోర్లు
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన రికార్డు కూడా సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. టెస్ట్ మ్యాచ్‌లలో మొత్తం 2058 ఫోర్లు కొట్టాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడం చాలా కష్టమని భావిస్తారు. సచిన్ బ్యాటింగ్ ఎంత ఆకట్టుకుందో ఇది తెలుపుతుంది.
Also Read:Sarfaraz Khan: దురదృష్టం మామూలుగా వెంటాడటం లేదుగా.. పాపం సర్ఫరాజ్ ఖాన్!
అత్యధిక 50+ స్కోరు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక యాభైకి పైగా పరుగులు చేసిన రికార్డు కూడా సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 264 సార్లు యాభైకి పైగా పరుగులు చేశాడు. నేటి క్రికెటర్లు బద్దలు కొట్టడం చాలా కష్టంగా ఉండే రికార్డు ఇది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?