Japan Earthquake: జపాన్‌లోని ఇషికావా ప్రిఫెక్చర్‌లో సోమవారం తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం, సోమవారం ఉదయం 6:31 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు రిక్టర్ స్కేలుపై ఐదు కంటే తక్కువ తీవ్రతతో ప్రకంపనలు కూడా నోటో నగరంలో కనిపించాయి. అదే సమయంలో, నానో, అనామిజు నగరాలతో పాటు నీగాటా ప్రిఫెక్చర్‌లోని కొన్ని ప్రాంతాలలో 4 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి సునామీ ముప్పు లేదని అధికారులు వెల్లడించారు.
Read Also: Loksabha Result 2024: రేపే ఎన్నికల కౌంటింగ్.. నేడు ఈసీ కీలక ప్రెస్‌మీట్