Site icon NTV Telugu

Bangalore: మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్.. 47 మంది విద్యార్థులకు అస్వస్థత

Food

Food

బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 47 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. దీంతో సిబ్బంది బాధిత విద్యార్థినులను గ్యాస్ట్రో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Kishan Reddy: పార్టీ ఫిరాయింపులు మీద తప్ప గ్యారంటీల మీద దృష్టి లేదు.. సీఎంపై కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

విద్యార్థినులు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారని మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, డాక్టర రమేష్ కృష్ణ తెలిపారు. ఫుడ్ పాయిజన్ లేదా డయేరియా అనేది ఇంకా నిర్ధారణ కాలేదని పేర్కొన్నారు. టెస్టు రిపోర్టులు రాగానే కారణం ఏంటి అనేది తెలుస్తుందని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థినులు కోలుకుంటున్నారని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Gold Price Today : మహిళలకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి ధరలు..

మరోవైపు విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు అస్వస్థతకు కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులు ఆస్పత్రికి వచ్చి.. తమ పిల్లల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా పరిస్థితిని వైద్యుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: The Family Star: నాలాంటి దాన్ని వాడుకుని వదిలేస్తే ఇంతే.. ఫ్యామిలీ స్టార్ యూనిట్ పై నటి సంచలన వ్యాఖ్యలు

Exit mobile version