Railway Recruitment 2024 : రైల్వేలో 4,660 ఉద్యోగాలు..అర్హులు ఎవరంటే?

Railway Jobs

Railway Jobs

రైల్వేలో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. తాజాగా రైల్వే శాఖ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 4,660 కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు.. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

మొత్తం పోస్టులు : 4,660
కానిస్టేబుల్ పోస్టులు: 4,208
సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు: 452

అర్హతలు..

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కానిస్టేబుల్ పోస్టులకు 10వ తరగతి. ఎస్‌ఐ ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణతను సాధించి ఉండాలి..

వయసు..

01.07.2024 నాటికి కానిస్టేబుల్ పోస్టులకు 18-28 ఏళ్ల మధ్య.. ఎస్‌ఐ పోస్టులకు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం..

నెలకు ఎస్‌ఐ పోస్టులకు రూ.35,400.. కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700గా వేతనం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ..

రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్‌ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు..

అప్లికేషన్ ఫీజు..

ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500గా నిర్ణయించారు.

ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాల కోసం అధికార వెబ్ సైట్..https://rpf.indianrailways.gov.in/RPF లో చూడవచ్చు..