NTV Telugu Site icon

Kerala : 42 మంది మహిళలను ముక్కలుగా నరికి పోలీస్ స్టేషన్ దగ్గర పడేసిన సీరియల్ కిల్లర్

New Project 2024 07 21t124959.508

New Project 2024 07 21t124959.508

Kerala : ప్రతిరోజు వార్తల్లో అనేక హత్యల గురించి తరచుగా వింటుంటాం. కానీ కొన్ని హత్యల గురించి విన్నప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది. కొన్ని హత్యలు చాలా క్రూరంగా, భయంకరంగా ఉంటాయి, వాటి గురించి విన్నప్పుడు గూస్‌బంప్స్‌ వస్తాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒక కేసు వైరల్ అవుతోంది. ఇందులో కెన్యాలో 42 మంది మహిళలను దారుణంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్‌ను అరెస్టు చేశారు. కేవలం రెండేళ్లలో ఈ మహిళలందరినీ ఈ వ్యక్తి హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ మానవ మృగం చేసిన దారుణం గురించి విన్న పోలీసు అధికారులు షాక్ అయ్యారు. దీని సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. తొలుత తన భార్య హత్యతో ఈ దారుణాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

Read Also:Warangal Bhadrakali Temple: శాకంబరీ అలంకరణలో భద్రకాళీ అమ్మవారు.. ఆలయానికి పోటెత్తిన భక్తులు!

రెండు సంవత్సరాలలో 42 మంది మహిళలను చంపినందుకు 33 ఏళ్ల కెన్యాకు చెందిన కొల్లిన్స్ జుమేసి ఖలుషా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మహిళలను తన వలలో పడేసుకుని హత్య చేసేవాడని వెలుగులోకి వచ్చింది. యూరో 2024 ఫుట్‌బాల్ ఫైనల్‌ను చూడటానికి వెళ్లిన క్లబ్ వెలుపల తెల్లవారుజామున 3 గంటలకు అతన్ని అరెస్టు చేశారు. ఈ హత్యలన్నీ తానే చేసినట్లు అంగీకరించినట్లు విచారణ అధికారి మహ్మద్ అమీన్ వెల్లడించారు. హత్యలు చేసిన తర్వాత మృతదేహాలను పోలీస్ స్టేషన్ సమీపంలోని డంపింగ్ ప్రదేశంలో పారేస్తానని కొల్లిన్స్ వెల్లడించినట్లు ఆయన చెప్పారు. అయితే ఇప్పటి వరకు తొమ్మిది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మృతదేహాలు బాగా ఛిద్రమై, కుళ్లిపోయి, తలలు లేని మొండెలను గుర్తించారు. కొందరి మృతదేహాలను ముక్కలుగా నరికి గోనె సంచులలో వేసి విసిరేశారు.

Read Also:YS Jagan: నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌

కొల్లిన్స్ జుమాసీ ఖలుషా ఒక సీరియల్ కిల్లర్ అని మహమ్మద్ అమీన్ వెల్లడించాడు. కాలిన్స్ అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు తన నివేదికలో చెప్పాడు. అతని గదిలో ఒక కత్తి, 12 నైలాన్ బస్తాలు, రెండు రబ్బరు గ్లౌజులు, ఒక హార్డ్ డ్రైవ్, ఎనిమిది స్మార్ట్‌ఫోన్‌లు లభించాయి. ఖలుషా మొదట తన భార్యను చంపినట్లు వెల్లడించాడు. ఇదంతా ఎలా మొదలైందో చెప్పాడు. మొదట తన భార్యను గొంతుకోసి హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి గోనె సంచులలో వేసి పడేశాడని చెప్పాడు. దీని తరువాత అతను ఆనందించడం ప్రారంభించాడు. దీని తరువాత అతను చాలా మంది మహిళలను చంపాడు. హత్యకు గురైన వారిలో ఒకరి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు కాలిన్స్ జుమాసి ఖలుషాను కనుగొన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అతను తన ఖాతాకు కొంత డబ్బును కూడా బదిలీ చేసినట్లు గుర్తించారు.