Site icon NTV Telugu

Drugs Destroyed: ఈశాన్య రాష్ట్రాల్లో అమిత్‌ షా సమక్షంలో 40 వేల కిలోల డ్రగ్స్ ధ్వంసం..

Drugs Destroyed

Drugs Destroyed

Drugs Destroyed: కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు 40,000 కిలోల డ్రగ్స్‌ ధ్వంసమైనట్లు హోంమంత్రి కార్యాలయం శనివారం వెల్లడించింది. హోంమంత్రి ట్వీట్‌ ప్రకారం.. అస్సాంలో దాదాపు 11,000 కిలోలు, అరుణాచల్ ప్రదేశ్‌లో 8000 కిలోలు, మేఘాలయలో 4000 కిలోలు, నాగాలాండ్‌లో 1600 కిలోలు, మణిపూర్‌లో 398 కిలోలు, మిజోరంలో 1900 కిలోలు, త్రిపురలో 1500 కిలోలు, త్రిపురలో 12,000 కిలోల మాదక ద్రవ్యాలు నాశనం చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఉన్నారు. హోంమంత్రి అమిత్ షా అస్సాం పర్యటనలో ఉన్నారు. ఆయన గువాహటి నుంచి వర్చువల్‌గా డ్రగ్స్‌ ధ్వంసం చేసే ప్రక్రియను పర్యవేక్షించినట్లు కేంద్ర హోంశాఖ ట్వీట్‌ చేసింది. గువాహటిలో 95,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి భవన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు.

Nirmala Sitharaman : నియామకాలన్న కేసీఆర్ రాష్ట్రంలో ఎందుకు ఉద్యోగాల భర్తీ జరపట్లేదు

అస్సాం పర్యటనలో ఉన్న అమిత్‌ షా.. డ్రగ్స్ అక్రమ రవాణా, జాతీయ భద్రత అంశంపై ప్రాంతీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈశాన్య ప్రాంతాల్లో మాదక పదార్ధాల అక్రమ రవాణా, నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఎన్‌సీబీ ఆధ్వర్యంలో 75,000 కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. అంతకు మించి రెండింతలు 150,000 కిలోలు ధ్వంసం చేయడం సంతోషంగా ఉందన్నారు. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మారుస్తామన్న కేంద్ర ప్రభుత్వ ఆశయానికి తగినట్లుగా డ్రగ్స్‌ను ధ్వంసం చేస‍్తున్నట్లు హోంశాఖ తెలిపింది. గత జులై 30న సుమారు 82వేల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. అదే రోజు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించిన అమిత్‌ షా.. 31 వేల కిలోల డ్రగ్స్‌ ధ్వంసం చేసే ప్రక్రియను వర్చువల్‌గా పర్యవేక్షించారు.

 

Exit mobile version