Site icon NTV Telugu

Dinosaur: ఉత్తరప్రదేశ్‌లో 40 మిలియన్ల సంవత్సరాల నాటి డైనోసార్ శిలాజం లభ్యం..

Dinosaur

Dinosaur

ఉత్తరప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్ జిల్లాలోని సహన్సారా నది ఒడ్డున తవ్వకాలలో మూడు కొమ్ముల డైనోసార్ అయిన ట్రైసెరాటాప్స్‌కు చెందినదిగా భావిస్తున్న శిలాజం బయటపడింది. ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో లక్షలాది సంవత్సరాల నాటి ట్రైసెరాటాప్స్ ముక్కు కొమ్ము బయటపడిందని నిపుణులు భావిస్తున్నారు. నేచురల్ హిస్టరీ అండ్ కన్జర్వేషన్ సెంటర్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ ఉమర్ సైఫ్ మాట్లాడుతూ.. ఒక కొత్త శిలాజం బయటపడింది. అది ట్రైసెరాటాప్స్ కి చెందినదిగా భావిస్తున్నారు… ఆ శిలాజం దాని ముక్కులో ఒక భాగం. ఇది ట్రైసెరాటాప్స్ కు చెందినదని మనం ఖచ్చితంగా చెప్పలేకపోయినా, ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఇతర ట్రైసెరాటాప్స్ శిలాజాలను ఇది పోలి ఉంటుంది. దీని స్వరూపం, ఆకారం, పరిమాణంతో పోలి ఉంటాయి అని అన్నారు.

Also Read:Jubilee Hills Bypoll: 139 డ్రోన్స్ నిఘాలో పోలింగ్ కేంద్రాలు.. ప్రైవేటు డ్రోన్స్‌కు నో పర్మిషన్..!

ఈ డైనోసార్‌లు సాధారణంగా చివరి క్రెటేషియస్ కాలంలో, 100.5, 66 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించాయని ఆయన వివరించారు. శిలాజం అసాధారణంగా సంరక్షించబడిందని ఆయన అన్నారు. ఈ శిలాజం 35-40 మిలియన్ సంవత్సరాలుగా ఖననం చేయబడిన దాని ముక్కు కొమ్ములో భాగమై ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో, ఈ ప్రదేశం మిలియన్ల సంవత్సరాల నాటి అనేక శిలాజాలను కనుగొన్న పరిశోధకులను ఉత్సాహపరిచింది.

Exit mobile version