Site icon NTV Telugu

Pakistan: వంతెనపై నుంచి పడిన బస్సు.. మంటలు చెలరేగి 40 మంది మృతి

Pakistan

Pakistan

Pakistan: నైరుతి పాకిస్థాన్‌లో వంతెనపై నుంచి బస్సు పడి మంటలు చెలరేగడంతో కనీసం 40 మంది మరణించారని ప్రభుత్వ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని లాస్బెలా జిల్లాకు చెందిన సీనియర్ అధికారి హమ్జా అంజుమ్ ప్రమాద స్థలంలో మాట్లాడుతూ.. మృతదేహాలు.. గుర్తుపట్టలేనంతగా ఉన్నాయన్నారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారని, బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారని, వంతెనపై ఉన్న పిల్లర్‌ను ఢీకొట్టి దారి తప్పిందని అంజుమ్ తెలిపారు.

Volodymyr Zelenskyy: ట్విస్ట్ ఇచ్చిన జెలెన్‌స్కీ.. రష్యాకి ఊహించని దెబ్బ

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. అధిక వేగమే ప్రమాదానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. దాదాపు 17 మృతదేహాలను వెలికతీశామని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్, రోడ్లు బాగా లేకపోవడం వల్లే పాకిస్థాన్‌లో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతాయని తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, 2018లో పాకిస్తాన్ రోడ్లపై 27,000 మందికి పైగా మరణించారు.

Exit mobile version