Site icon NTV Telugu

Car Accident: హైవేపై మూడు సార్లు పల్టీలు.. నలుగురు అక్కడికక్కడే మృతి

Car Accident

Car Accident

Car Accident: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ప్రయాణిస్తున్న కారు మూడు పల్టీలు కొట్టడంతో నలుగురు వ్యక్తులు మరణించగా, ఒకరు గాయపడినట్లు అధికారి తెలిపారు. లాతూర్ జిల్లాకు చెందిన ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం పుణెకు వెళుతుండగా, పుణె-సోలార్‌పూర్ హైవేపై భిగ్వాన్ వద్ద తెల్లవారుజామున 3.20 గంటలకు ప్రమాదం జరిగినట్లు అధికారి తెలిపారు.

Read Also: Bus Robbery: సినిమా స్టైల్‌లో బస్సులో 10 లక్షల దోపిడీ.. బైక్‌తో అడ్డగించి మరీ..

ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్‌ నిద్రపోవడం వల్ల వేగంగా వెళ్తున్న కారు నియంత్రణ కోల్పోయి పల్టీలు కొట్టి ఉండొచ్చని అధికారి ఒకరు తెలిపారు. వాహనం హైవేపై నుంచి వెళ్లి మూడుసార్లు పల్టీలు కొట్టడంతో వృద్ధురాలు, డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు.గాయాలతో బయటపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చారని, బాధితుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.

Exit mobile version