NTV Telugu Site icon

Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి!

Road Accident

Road Accident

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రాహ్మణపల్లిలోని తుమ్మల చెరువు సమీపంలో అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై గీతిక స్కూల్ వద్ద చెట్టును కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని పిడుగురాళ్ల పోలీసులు పరిశీలించారు.

తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం చేసుకొని కావలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని సిరిపురం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు ఆంజనేయ స్వామి మాలధారణలో ఉన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Show comments