NTV Telugu Site icon

Train Accident: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో గూడ్స్ రైలును రైలు ఢీ.. నలుగురు మృతి

Train Accident

Train Accident

ఐరోపా దేశమైన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ నుంచి హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఈరోజు తెల్లవారుజామున గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 23 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ సంఘటన ప్రాగ్‌కు తూర్పున 100 కిలోమీటర్లు (62 మైళ్ళు) దూరంలో ఉన్న పార్దుబిస్ నగరంలో జరిగిందని ఆ దేశ మంత్రి విట్ రాకుసన్ తెలిపారు. ప్యాసింజర్ రైలు ప్రైవేట్ రెజియోజెట్ కంపెనీకి చెందినదని రకుసన్ చెప్పారు. దీంతో తూర్పు భాగం గుండా ఒక ప్రధాన ట్రాక్ మూసివేయవలసి వచ్చిందన్నారు.

Read Also: Aranmanai 4 OTT: ఓటీటీలో తమన్నా, రాశీఖన్నా ‘బాక్‌’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కాగా, ఈ రైలులో 300 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.. వీరిలో చాలా మంది విదేశీయులు.. ప్రైవేట్ రెజియోజెట్ కంపెనీ నిర్వహించే ఈ రైలు స్లోవేకియా సరిహద్దుకు దగ్గరగా ఉన్న పశ్చిమ ఉక్రేనియన్ నగరమైన చాప్‌కు వెళ్తుండగా.. పార్దుబిస్ మెయిన్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెక్ రిపబ్లిక్ దేశ రవాణా శాఖ మంత్రి మార్టిన్ కుప్కా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ కొనసాగుతుందన్నారు. ఇక, గూడ్స్ రైలు కాల్షియం కార్బైడ్‌ను తీసుకువెళుతుందని స్థానిక అగ్నిమాపక శాఖ ప్రతినిధి వెందుల హోరకోవా పేర్కొన్నారు. ఈ దుర్ఘటనను పెను విషాదంగా అభివర్ణించిన ఆయన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.