NTV Telugu Site icon

Madhya Pradesh: మద్యం ఫ్యాక్టరీ నుంచి రక్షించిన 39 మంది చిన్నారులు మిస్సింగ్..

Madhya Pradesh

Madhya Pradesh

మధ్యప్రదేశ్లో మద్యం ఫ్యాక్టరీ నుంచి రక్షించిన 39 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. శనివారం నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ఆధ్వర్యంలో రైసెన్‌లోని ఓ లిక్కర్ ఫ్యాక్టరీపై రైడ్ చేశారు. అందులో బాల కార్మికులు ఉన్నట్లు గుర్తించి దాడి చేయగా.. 39 మంది బాల కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. తర్వాత ఉన్నట్టుండి పిల్లలు మిస్సింగ్ అయినట్లు ఎన్‌సీపీసీఆర్(NCPCR) చైర్మన్ తెలిపారు. అంతకుముందు.. బాలకార్మికులను రక్షించిన తర్వాత ఎన్‌సీపీసీఆర్‌ బృందం చిన్నారుల చేతులపై కాలిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. రసాయనాలు చేతుల మీద పడటం వల్ల పాడైపోతాయని తెలిపారు. ఆ మద్యం ఫ్యాక్టరీలో చిన్నారులచే పనులు చేయిస్తున్నారని ఎన్‌సీపీసీఆర్ చైర్మన్ ప్రియాంక్ కనుంగో తెలిపారు. ఈ క్రమంలో.. మద్యం ఫ్యాక్టరీపై రైడ్స్ చేసి పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.

Bahishkarana : అంజలి బర్త్ డే స్పెషల్.. ‘బహిష్కరణ’ నుంచి పోస్టర్ రిలీజ్..

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ట్విట్టర్ వేదికగా స్పందిచారు. “రైసెన్ జిల్లాలో ఒక కర్మాగారంపై దాడి చేసిన సమయంలో బాల కార్మికుల కేసు నా దృష్టికి వచ్చింది. ఈ విషయం చాలా తీవ్రమైనది. దీనికి సంబంధించి కార్మిక, ఎక్సైజ్‌, పోలీసు శాఖల అధికారుల నుంచి సమగ్ర సమాచారం సేకరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని” చెప్పారు. అయితే రక్షించబడిన బాలకార్మికులు కస్టడీ నుండి అదృశ్యమయ్యారని ప్రియాంక్ కనుంగో చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

Japan: జపాన్ లో అరుదైన వ్యాధి.. అది సోకిన 48 గంటల్లో మనిషి ఖతం!

చట్టం ప్రకారం.. రక్షించబడిన పిల్లలను వారి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేయడానికి సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) ముందు హాజరుపరుస్తామని ఆయన చెప్పారు. శనివారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో సంబంధిత అధికారులను అక్కడికి పంపుతున్నట్లు సమాచారం అందిందని, అయితే వారు రాత్రి 7:00 గంటల వరకు రాలేదన్నారు. “SDM 5 గంటల తర్వాత చేరుకుంది, అయితే ADM (అదనపు జిల్లా మేజిస్ట్రేట్) 7 గంటల తర్వాత వచ్చినట్లు ప్రియాంక్ కనుంగో తెలిపారు. అయితే.. ఈ ఆలస్యం వల్ల నేరస్థులు పిల్లలను కిడ్నాప్ చేయడానికి లేదా.. తెలియని ప్రదేశానికి తరలించినట్లుగా ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే.. పిల్లలు కనిపించకుండా పోవడంతో వారికి ఇవ్వాల్సిన రూ. 5-10 లక్షల నష్టపరిహారాన్ని ఇప్పుడు చెల్లించలేమని ప్రియాంక్ కనుంగో పేర్కొన్నారు. ఈ ఘటనపై అర్ధరాత్రి ఓ అధికారిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు అదృశ్యమైన చిన్నారుల కోసం అధికారులు వెతికే పనిలో పడ్డారు.