Site icon NTV Telugu

Hyderabad MMTS : నేడు పలు ఎంఎంటీఎస్ సేవలు రద్దు..

Mmts Hyderabad

Mmts Hyderabad

34 MMTS Termination of Services

ప్రతి వారంలాగానే ఈ వారం కూడా పలు ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. నేడు హైదరాబాద్‌లో 34 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో నడిచే 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో 7 సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, సికింద్రాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్‌లో ఒక్కో సర్వీసును రద్దు చేసినట్టు తెలిపింది. నిర్వహణ సమస్యల కారణంగా సర్వీసులను రద్దు చేసినట్టు తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరింది దక్షిణ మధ్య రైల్వే శాఖ.

Exit mobile version