Site icon NTV Telugu

Google Engineer Suicide: గూగుల్ ఆఫీస్‌పై నుంచి దూకి యువ టెకీ ఆత్మహత్య

Google

Google

Google Engineer Suicide: 31 ఏళ్ల గూగుల్ ఉద్యోగి న్యూయార్క్‌లోని చెల్సియాలో గల ప్రధాన కార్యాలయంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గురువారం చెల్సియాలోని గూగుల్ 14వ అంతస్తు భవనంపై నుంచి ఉద్యోగి దూకి మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది. ఆ వ్యక్తి వివరాలను పోలీసులు, అధికారులు వెల్లడించలేదు. మృతుడి కుటుంబ సభ్యులకు ఇంకా సమాచారం ఇవ్వలేదు. ఫిబ్రవరిలో ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న తర్వాత చోటుచేసుకోవడం ఇది రెండో ఘటన.

Read Also: Viral : భారీ శ్వేత నాగు.. ఆశ్చర్యపోయిన స్థానికులు.. వీడియో వైరల్

14వ అంతస్తు నుంచి దూకి అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కార్యాలయం వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నాడన్న సమాచారంపై పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. నేలపై అచేతనంగా పడి ఉన్న అతడిని సమీప ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే, గూగుల్ కార్యాలయం 14వ అంతస్తు అంచుపై టెకీ చేతి వేలి ముద్రలు లభించడంతో అతడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై గూగుల్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఫిబ్రవరిలో ఇదే కార్యాలయంలోని ఓ గూగుల్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాట్(33) తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకున్నాడు. దీంతో, గూగుల్‌ ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది.

Exit mobile version