స్పోర్ట్స్ బైక్‌లను తయారు చేసే జపనీస్ ఆటోమేకర్ కవాసకి, ఏప్రిల్ 2025లో తన బైక్ మోడల్స్ పై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. కంపెనీ ఈ నెలలో సమ్మర్ కార్నివాల్ ఆఫర్‌ను అందించింది. ఈ ఆఫర్ మే 31, 2025 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు చెల్లుతుంది. కవాసకి సమ్మర్ కార్నివాల్ ఆఫర్‌లో కవాసకి నింజా ZX-10R ఎక్స్-షోరూమ్ ధరపై రూ. 30,000 EMI క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. ఈ సూపర్‌స్పోర్ట్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 17,93,000. ఇది 998 cc లిక్విడ్-కూల్డ్ ఇన్‌లైన్ 4 సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 203PS శక్తిని, 114.9Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Also Read:GHMC : హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
సమ్మర్ కార్నివాల్ ఆఫర్‌లో కవాసకి వెర్సిస్ 650 ఎక్స్-షోరూమ్ ధరపై రూ.20,000 తగ్గింపు ఇస్తున్నారు. వెర్సిస్ 650 ధర రూ. 7,77,000, ఎక్స్-షోరూమ్. ఇది ఒకే వేరియంట్‌లో, ఒకే కలర్ స్కీమ్ తో అందించబడుతుంది. ఇది 649cc, లిక్విడ్-కూల్డ్, ప్యారలల్ ట్విన్ మోటార్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 67PS శక్తిని, 61Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Also Read:Pahalgam terror attack: ఆర్మీ యూనిఫాంలో టెర్రరిస్టులు.. “ముస్లిం” కాదని కాల్పులు..
నింజా 1100SX ఈ స్పోర్ట్స్-టూరర్ మోటార్‌సైకిల్ ఎక్స్-షోరూమ్ ధరపై రూ. 10,000 EMI క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. కవాసకి నింజా 1100SX ఎక్స్-షోరూమ్ ధర రూ. 13,49,000. ఇది 1,099cc, లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్-4 ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 136PS శక్తిని, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
