NTV Telugu Site icon

Uttarakhand : ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు

Landslides

Landslides

Uttarakhand : ఉత్తరాఖండ్‌లో ఛార్‌దామ్‌ యాత్రకు ఈ సారి భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. చార్‌దామ్‌ యాత్రకు వెళ్తున్న భక్తులకు మంచుకొండల్లోని కొండ చరియలు విగిపడుతుండటంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొండ చరియలు విరిగి పడటంతో రోడ్లు కూడా ధ్వంసం అవుతుండటంతో వారి ప్రయాణం ముందుకు సాగడం లేదు. భారీగా కొండచరియలు విరిగి పడటంతో సుమారు 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకున్నారు.

చార్‌ధామ్‌ యాత్రలో భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. భక్తుల యాత్రకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీగా రాళ్లు పడటంతో లఖన్‌పూర్‌ సమీపంలో లిపులేఖ్‌-తవాఘాట్‌ రోడ్డు వంద మీటర్ల మేర ధ్వంసమైంది. దీంతో ధార్చులా, గంజీలో సుమారు 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. దెబ్బతిన్న రోడ్డును మరమ్మత్తు చేయడానికి మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. ఉత్తరకాశి, ఉదంసింగ్‌నగర్‌, గర్వాల్‌, చమోలీ, అల్మోరా సహా పలు జిల్లాల్లో దూళి, ఉరుములతో కూడిన వాన వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు కోరారు.

Read Also: AP CM Jagan: చంద్రబాబుకు కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులే..

అత్యవసరమైతేనే బయటకు రావాలని, వాహనాలను జాగ్రత్తగా పార్క్‌ చేసుకోవాలని సూచించారు. యమునోత్రి, గంగోత్రి యాత్రకు వచ్చేవారు వాతావరణ పరిస్థితులను బట్టి తమ యాత్రను కొనసాగించాలని అధికారులు సూచించారు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాల్లోనే వాహనాలను పార్కింగ్‌ చేసుకోవాలని.. యమునోత్రి, గంగోత్రి యాత్రకు వచ్చే ప్రయాణీకులు వాతవారణ సూచన తర్వాతనే ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోవాలని.. తమ వెంట రెయిన్‌ కవర్‌, గొడుగు, వెచ్చని వస్ర్తాలు ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నవంబర్‌ రెండో వారం వరకు ఈ యాత్ర సాగనుంది.

 

Show comments