Tanker Accident: మహారాష్ట్రలోని పుణెలో ఆయిల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. ఆదివారం పుణెలోని నవాలే వంతెన వద్ద అతివేగంతో లారీ దూసుకురావడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. పలు వాహనాలను ట్యాంకర్ ఢీకొనడంతో కనీసం 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 48 వాహనాలు కుప్పకూలిపోయాయని పూణే అగ్నిమాపక దళ అధికారి తెలిపారు. పుణె ఫైర్ బ్రిగేడ్, పుణె మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను హుటాహుటిన దవాఖానకు తరలించాయి.
Uttarpradesh Crime: శ్రద్ధా హత్య తరహాలో మరో హత్య.. దేహాన్ని 6 ముక్కలు చేసి..
స్థానిక మీడియా ప్రకారం.. ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో ట్యాంకర్ పలు వాహనాలను ఢీకొట్టింది. రాత్రి 9 గంటలకు జరిగిన ప్రమాదంలో ఆయిల్ రోడ్డుపై చిందిన కారణంగా వాహనాలు జారడం వల్ల కూడా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా ముంబైకి వెళ్లే రహదారిపై ట్రాఫిక్ స్తంభించి 2 కి.మీ పొడవునా జామ్‌లు ఏర్పడినట్లు నివేదించబడింది. గత కొన్ని రోజులుగా నావెల్ బ్రిడ్జ్ ప్రమాదాల హాట్ స్పాట్‌గా మారుతోంది. శుక్రవారం ఔటర్ రింగ్ రోడ్డుపై వంతెన సమీపంలో వేగంగా వస్తున్న కారు ఢీకొని మహిళ మృతి చెందింది.
A major accident occurred at Navale bridge on the Pune-Bengaluru highway in Pune in which about 48 vehicles got damaged. Rescue teams from the Pune Fire Brigade and Pune Metropolitan Region Development Authority (PMRDA) have reached the spot: Pune Fire Brigade pic.twitter.com/h5Y5XtxVhW
— ANI (@ANI) November 20, 2022
Major accident near Navle bridge, about 48 vehicles damaged, several injured..!!#Pune #Maharashtra #accidente@nitin_gadkari @Dev_Fadnavis @narendramodi @AmitShah pic.twitter.com/dZLFMFJbek
— 𝕾𝖆𝖓𝖌𝖗𝖆𝖒⚜️ (@sangram_0277) November 20, 2022
Horrible Accident at Navale Bridge Pune …. minimum of 20-30 vehicles involved pic.twitter.com/FbReZjzFNJ
— Nikhil Ingulkar (@NikhilIngulkar) November 20, 2022