Site icon NTV Telugu

Sadhus: బెంగాల్ లో సాధులపై దాడి.. టీఎంసీపై బీజేపీ ఆగ్రహం

Sadhus

Sadhus

West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో గంగా సాగర్‌కు వెళ్తున్న సాధువులను చూసిన కొందరు పిల్లలను ఎత్తుకెళ్తారనుకొని చితకబాదారు. ఈ ఘటన పురులియా జిల్లాలో చోటు చేసుకుంది. అయితే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సాధువులు మకర సంక్రాంతి సందర్భంగా బెంగాల్ లో నిర్వహించే గంగాసాగర్ మేళాకు కారులో వస్తున్నారు.. పురిలియా జిల్లాకు చేరుకున్నారు.. అక్కడ దారి తప్పిన వాళ్లు.. రూట్ గురించి ఇద్దరు మైనర్ బాలికలను అడిగారు.. అయితే వాళ్లు భయపడి కేకలు వేయడంతో స్థానకంగా ఉన్న కొందరు వచ్చి ఆ సాధువులను పట్టుకొని కొట్టారు.

Read Also: Allu Arjun: సోషియో ఫాంటసీ డ్రామాతో మాంత్రికుడు రెడీ?

ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సాధువులను రక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పురూలియా ఎస్పీ అభిజిత్‌ బెనర్జీ చెప్పుకొచ్చారు. సాధువులపై దాడి చేసిన వారిని గుర్తించాం.. వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. అక్కడ ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇక, ఈ వీడియోపై భారతీయ జనతా పార్టీ మమత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also: Winter Storm: అమెరికాలో తుఫాన్ దెబ్బకు రెండు వేల విమానాలు రద్దు..

రాష్ట్రంలో హిందూవులపై దాడి జరుగుతున్న కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా వ్యాఖ్యనించారు. ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ.. “మమతా బెనర్జీ మౌనంగా ఉండటం దారుణం! ఈ హిందూ సాధువులు మీకు కనిపించడం లేదా? అని విమర్శించారు. ఈ సంఘటనను 2020లో జరిగిన మహారాష్ట్రలోని పాల్ఘర్ మాబ్ లించింగ్‌తో పోల్చుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ పాలనలో షాజహాన్ షేక్ వంటి ఉగ్రవాదులకు రక్షణ లభిస్తుంది.. కానీ, సాధువులు మాత్రం చంపబడుతున్నారు అని అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు.

Exit mobile version