Site icon NTV Telugu

Skoda: త్వరలో కొత్త మోడళ్లతో భారత్ మార్కెట్లోకి స్కోడా..

Skoda

Skoda

త్వరలో భారత్ మార్కెట్లోకి స్కోడా 3 కొత్త మోడళ్లతో కార్లను విడుదల చేస్తుంది. అందులో ఒక EV కూడా ఉంది. ఇప్పటికే స్కోడా ఆటో ఇండియా, కుషాక్ మరియు స్లావియాతో సహా.. ఇండియా 2.0 ప్రోగ్రామ్ కార్లతో పోలిస్తే అమ్మకాల గణాంకాల పరంగా మంచి పనితీరును కొనసాగిస్తోంది. అయితే.. చెక్ కార్ల తయారీ సంస్థ భవిష్యత్తులో కొత్త కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. భారతదేశానికి రానున్న స్కోడా 3 కొత్త మోడళ్ల కార్ల గురించి తెలుసుకుందాం.

Porsche car crash: కారు ప్రమాదం కేసులో మైనర్ తాతని అరెస్ట్ చేసిన పూణె పోలీసులు..

స్కోడా కాంపాక్ట్ SUV
స్కోడా కాంపాక్ట్ SUVని భారతీయ రోడ్లపై అనేకసార్లు ట్రై చేశారు. అయితే.. ఈ కారు 2025 మార్చిలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ కారులో స్పై షాట్ల రూపకల్పన హైలైట్ గా ఉండనుంది. ఇందులో ఇన్‌వర్టెడ్ L- ఆకారపు LED టెయిల్ ల్యాంప్స్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఇంటిగ్రేటెడ్ హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌తో కూడిన చిన్న రూఫ్ స్పాయిలర్.. మొత్తంగా ఇది కుషాక్‌తో అనేక భాగాలను పంచుకుంటుంది. అంతేకాకుండా.. సుపరిచితమైన MQB A0 IN ప్లాట్‌ఫారమ్ ఆధారంగా.. SUV 1.0-లీటర్ TSI ఇంజన్‌తో 115 bhp మరియు 178 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కోడా తన కొత్త కాంపాక్ట్ SUVతో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను అందిస్తుంది. ధరల వారీగా.. ఇది రూ. 10 నుండి 15 లక్షల (ఆన్-రోడ్, ముంబై) మధ్య ఉండవచ్చని అంచనా.

స్కోడా ఎన్యాక్ iV
స్కోడా మొదటి ఎలక్ట్రిక్ కారు 2024 సెకాండాఫ్ లో భారత మార్కెట్లోకి రానుంది. ప్రారంభంలో ఈ EV భారతదేశంలో CBU ద్వారా విక్రయించబడుతుంది. భారతీయ మార్కెట్లో.. ఇది IONIQ 5, Kia EV6, Volvo XC40 రీఛార్జ్ వంటి కార్లతో పోటీపడుతుంది.

న్యూ స్కోడా ఆక్టావియా
స్కోడా ఆక్టావియా లేటెస్ట్ మోడల్.. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అంతర్జాతీయ మార్కెట్‌ల కోసం మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌ను పొందింది. అయితే కొత్త ఆక్టావియా ఖచ్చితమైన భారత లాంచ్ టైమ్‌లైన్ ధృవీకరించబడలేదు. చెక్ కార్ల తయారీ సంస్థ స్పోర్టీ ఆక్టావియా RS-iVని భారత మార్కెట్లోకి తీసుకురావచ్చని నివేదించబడింది. ఫోర్త్ జనరేషన్ ఆక్టావియా ఆధారంగా.. పనితీరు-ఆధారిత RS-iV వేరియంట్ భారతదేశంలో CBU ద్వారా విక్రయించబడుతుంది. సెడాన్ 1.4-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌తో 116 bhp ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడుతుంది. ఇది 245 బిహెచ్‌పిల పవర్ అవుట్‌పుట్, 400 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Exit mobile version