NTV Telugu Site icon

Russian Drone Attack: కీవ్‌లోని ఓ పాఠశాలపై రష్యా డ్రోన్ దాడి.. ముగ్గురు దుర్మరణం

Russian Drone Attack

Russian Drone Attack

Russian Drone Attack: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని ఓ ఉన్నత పాఠశాలపై రష్యా డ్రోన్‌ దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. కీవ్‌లోని స్కూల్‌పై రష్యా రాత్రిపూట ఈ దాడి చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురని మరణించారని, ఇద్దరు గాయపడ్డారని, ఓవ్యక్తి రక్షించబడ్డారని, నలుగురు వ్యక్తులు శిథిలాల కింద ఉండవచ్చని రాష్ట్ర అత్యవసర సేవ టెలిగ్రామ్‌లో తెలిపింది.

Read Also: Blast at Cracker Factory: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది సజీవదహనం

కీవ్‌కు దక్షిణంగా 80 కిలోమీటర్ల (50 మైళ్ళు) దూరంలో ఉన్న ఓ పాఠశాలపై ఈ డ్రోన్‌ దాడి జరిగింది. ఈ దాడిలో భవనాలు చాలా వరకు దెబ్బతిన్నాయని అత్యవసర సేవల అధికారులు తెలిపారు. ఈ దాడిలో విద్యార్థులు ఉండే రెండు అంతస్థులు, చదువుకునేందుకు ఉపయోగించే భవనం పాక్షికంగా ధ్వంసమయ్యాయని తెలిసింది. ఉదయం 7 గంటలకు పాఠశాలలో 300 చదరపు మీటర్ల (3,200 చదరపు అడుగులు) కంటే ఎక్కువ మంటలు వ్యాపించాయి. రష్యా క్రమం తప్పకుండా ఉక్రెయిన్‌పై క్షిపణులు, ఫిరంగిదళాలు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. తరచుగా విద్యుత్ కోతలకు కారణమవుతోంది. దీనివల్ల ప్రజలు తమ ఇళ్లలో వేడినీరు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.