Elephant Herd Attack: అస్సాంలోని గోల్‌పరా జిల్లాలో గురువారం అడవి ఏనుగుల గుంపు దాడి చేయడంతో ఒక చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారని లఖీపూర్ అటవీ రేంజ్ అధికారి ధృబా దత్తా తెలిపారు. రెండు వాహనాలను ఏనుగులు ధ్వంసం చేశారు. గోల్‌పరా జిల్లాలోని లఖీపూర్ అటవీ రేంజ్‌లోని లఖిపూర్-అజియా రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
Delivery In Washroom : ప్రెగ్నెన్సీ అని తెలియకుండానే బిడ్డకి విమానంలో జన్మనిచ్చిన మహిళ
ఏనుగు గుంపు రెండు వాహనాలపై దాడి చేయడంతో ఒక చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారని ధృబా దత్తా తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఏనుగులు అడవుల్లోంచి జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. చేతికొచ్చిన పంటను నష్టం చేయడమే కాకుండా.. స్థానిక ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఒక్కోసారి ప్రజలను చంపేస్తున్నాయి కూడా. ఇకపోతే తాజాగా ఓ ఏనుగుల గుంపు అటవీ ప్రాంతంలో ఉన్న ఓ రోడ్డులో నానా రచ్చ చేశాయి.
